Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

జిడిపిలో 10 శాతం వాటా వారిదే..

ఏడు నెలల్లో భారీగా పెరిగిన 20 మంది భారతీయ బిలియనీర్ల సంపద

GDPన్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం సంపద 20 మంది కుభేరుల చేతిలోనే ఉన్నాయని ఓ సర్వే వెల్లడించింది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 20 మంది భారత పారిశ్రామికవేత్తల ఆస్తులు మరో 50 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో వారి మొత్తం సంపద విలువ 200 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అంటే 2 ట్రిలియన్ల దేశీయ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం వాటా వారిదే ఉంటుంది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. 2 ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు కోటి కోట్లకు పై ఉంటుంది. ఏడు నెలల కాలంలో 18 మంది భారతీయ బిలీనియర్లలో ప్రతి ఒక్కరూ తమ సంపదను 1 బిలియన్ డాలర్లు (రూ.6400 కోట్లు) పెంచుకుంటున్నారని నివేదిక తెలిపింది. ఆయిల్ నుంచి టెలికాం వరకు పలు వ్యాపారాలతో మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అదనంగా ఏకంగా 13 బిలియన్ డాలర్లను పెంచుకున్నారు. అదే సమయంలో అదానీ గ్రూప్‌నకు చెందిన గౌతమ్ అదానీ, విప్రో అజిమ్ ప్రేమ్‌జీ, ఆర్‌కే దమానీ వంటి వారు బ్లూమ్‌బర్గ్ జాబితాలో స్థానం దక్కించుకుంది. వీరి సంపద 3-4 బిలియన్ డాలర్ల మధ్యలో పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు తొమ్మిదేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ సంస్థ మార్కెట్ మూలధనం రూ.5,25,000 కోట్లకు చేరుకుని దేశంలోనే నంబర్ వన్ సంస్థగా అవతరించింది.
విప్రో ప్రమోట్‌చేస్తున్న అజిమ్ ప్రేమ్‌జీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 4 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఎన్‌సిసి, జుబిలెంట్ ఫుడ్‌వర్క్, క్రాంప్టన్ గ్రీవ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, జెఎం ఫైనాన్సియల్ సంస్థల్లో అజీమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్ వాటాలను కలిగి ఉంది. వీటితో ప్రేమ్‌జీ సంపద మొత్తం 3.8 బిలియన్ డాలర్లు పెరిగి 16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దమానీ, గౌతమ్ అదానీ, ఉదయ్ కొటక్, కుమార్ మంగళం బిర్లా, పంకజ్ పటేల్, విక్రమ్ లాల్, లక్ష్మీ మిట్టల్, కెపి సింగ్, అజయ్ పిరామిళ్, పల్లోజి మిస్త్రీ వంటి వారు ప్రతి ఏడాది 2 బిలియన్ డాలర్లను పెంచుకుంటున్నారు.

Comments

comments