Home వికారాబాద్ పోలీస్ ప్రజావాణిలో 20 ఫిర్యాదులు

పోలీస్ ప్రజావాణిలో 20 ఫిర్యాదులు

 20 people complained to the police help line service

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ ప్రజావాణిలో 20 మంది ఫిర్యాదుదారులు జిల్లా ఎస్‌పి అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్‌పి అన్నపూర్ణ స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ మండలానికి చెందిన జయజ్యోతి బసవేశ్వర విద్య సంస్థ భూమి విషయంలో ఫిర్యాదు చేశారు. మర్పల్లి మండలానికి చెందిన కతావత్ భారతి కుటుంబ తగాదాల విషయమై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తాండూరు పట్టణానికి చెందిన మనీకిషోర్, కుమ్మరి స్వప్న భర్త హైద్రాబాద్ మనీ ట్రాన్స్‌ఫోర్ట్‌లో పని చేస్తున్న సమయంలో చనిపోగా ఆ సంస్థ నందు వచ్చే డబ్బులను ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. వికారాబాద్ పట్టణానికి చెందిన పోచమ్మ, కళ్యాణ్ ఇరువురు గొడవ పడిన విషయం ఫిర్యాదు చేశారు.