Home తాజా వార్తలు ఆటో బోల్తా 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు

ఆటో బోల్తా 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు

20 Students Injured in Road Accident in Wanaparthy District

వనపర్తి : పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన జిల్లాలోని పాన్‌గల్ మండలం అన్నారం వద్ద  చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకి గాయలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా  దవఖానకు తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్నారం తండా నుంచి పాన్‌గల్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు సమాచారం.