Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ట్రాక్టర్ పోటీల్లో దారుణం…

200 injured in tractor tournaments in Padampur in Rajasthan
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని పదంపూర్‌లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టేడియం పై కప్పు కుప్పకూలింది. దీంతో దాదాపు 200 మంది గాయపడి ఉంటారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై శ్రీ గంగా నగర్ ఎంపి నిహాల్ చంద్ చౌహాన్ స్పందించారు. క్షతగాత్రులకు త్వరలోనే నష్టపరిహారాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కూలిన కప్పు క్రింద ఎవరూ చిక్కుకోలేదన్నారు. జిల్లా కలెక్టర్ ఘటన స్థలిలోనే ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం వైద్యుల బృందాన్ని పంపించామని తెలిపారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ  ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Comments

comments