Home తాజా వార్తలు ద్రోహులతోనా పొత్తు?

ద్రోహులతోనా పొత్తు?

200 people from various parties joining in TRS Party

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారు

అరవై ఏండ్లలో లేని అభివృద్ధి నాలుగేండ్లలో జరిగింది
కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలి
టిఆర్‌ఎస్‌లో వివిధ పార్టీల నుండి 200 మంది చేరిన సందర్భంగా తన్నీరు హరీశ్‌రావు

మన తెలంగాణ/జగదేవ్‌పూర్: తెలంగాణకు అడ్డుపడ్డ ద్రోహి టిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం టిఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా సిద్దపేట జిల్లా, జగదేవ్‌పూర్ మండలంలోని కొండపోచమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జంగంరెడ్డిపల్లిలోని రామునిబట్ల పురాతన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జంగంరెడ్డిపల్లి, తీగుల్ నర్సాపూర్, చాట్లపల్లి, మునిగడప, రాంనగర్, తిగుల్ గ్రామాలలో పార్టీ జెండావిష్కరణ గావించారు. మహిళలు డప్పుచప్పుల్ల మధ్య భోనాలతో, బతుకమ్మ ఆటలతో మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ఘన స్వాఘతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణ ద్రోహులతో, టిడిపితో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటని టిఆర్‌ఎస్ పార్టీని ఓడించలేమని మహాకూటమి పేరుతో అధికారాన్ని చేజిక్కించుకోడానికే తప్పా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు ఏ కోసాన ఆలోచించడం లేదన్నారు. అరవై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు ఎం చేసిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని అరవై ఎండ్లలో చేయని అభివృద్ధి నాలుగేళ్ళలో చేసి చూపించిన ఏకైక నేత సిఎం కెసిఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి మండంలో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, మురికి కాల్వలు, ప్రతి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మిషన్ భగీరథ నీరందించామన్నారు. అనేక సంక్షేమపథకాలు తీసుకువచ్చామని ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత కెసిఆర్‌దేనన్నారు. రాష్ట్రంలోనే గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని, ఇంకా అభివద్ధి జరగాలంటే కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి గెలిస్తే జరుగుతాదా…! రాష్ట్రాన్నే పరిపాలించే వ్యక్తి కెసిఆర్ గెలిస్తే అభివృద్ధి జరుగుతదా ఆలోచించండన్నారు.

మళ్లీ టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఊహించని రీతిలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. కొన్ని గ్రామాలలో భూ సర్వేలు జరగలేదు, వాటిని త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు. అనంతరం పలు గ్రామాల నుండి సుమారు 200 మంది ఆయా పార్టీల నాయకులు హరీశ్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబి కాండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మళ్లీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చెర్మన్ తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుందని గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు 60 ఎండ్లు ముందుకు వెళ్లాయన్నారు. ఎవ్వరు ఊహించని అభివృద్ధి పనులు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గజ్వేల్ నుండి కెసిఆర్‌ను భారీ మెజార్టితో గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చెర్మన్ పన్యాల భూపతి రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చెర్మన్ ఎలక్షన్‌రెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చెర్మన్ భూంరెడ్డి పాల్గొన్నారు.