Home వార్తలు న్యూ ఇయర్ వేడుకలు మన దేశం కంటే ముందుగా ఏ దేశంలో జరుగుతాయి

న్యూ ఇయర్ వేడుకలు మన దేశం కంటే ముందుగా ఏ దేశంలో జరుగుతాయి

happy-new-yearవరల్డ్ టైం జోన్ ప్రకారం న్యూ ఇయర్ వేడుకలు మన దేశం కంటే ముందుగా ఏ దేశంలో జరుగుతాయి. ఎలా జరుపుకుంటారు? వీటి గూర్చి తెలియాలంటే చదవండి మరి.చిన్న దేశాలను మినహాయిస్తే ఆ వరుస క్రమం ఈ విధంగా ఉంది.ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్న  పద్ధతులు ఒకింత ఆశ్చర్యంగా ఉన్నాయి…

1.న్యూజీలాండ్ – జేవియస్ క్వే,ఫ్రాంక్ కిట్స్ పార్క్-వెల్లింగ్‌టన్ లో జరిగే న్యూ ఇయర్ వేడుకలకు అన్ని వయసులవారు హాజరవుతారు. దీనికి ఎటువంటి రుసుము లేదు. సాయంత్రం 8 గంటలకు ఆరంభమయ్యే సంబరాలు కుటుంబసభ్యులందరికీ వినోదాన్ని పంచుతాయి.రోడ్జర్ ఫాక్స్ బిగ్ బ్యాండ్ యాక్షన్ మ్యూజిక్ తో కొత్త సంవత్సర సంబరాలు ఆరంభమవుతాయి.
2.రష్యా – గ్రొగేరియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుకునే డిసంబర్ 31వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొంటారు.సంగీత విభావరి మరియు టపాకాలయలు పేల్చడం వంటివి కలిసి చేస్తారు.రెడ్ స్కేర్‌లో అందరూ కలిసి లేట్ డిన్నర్ చేస్తారు,ట్రెడిషనల్ రష్యన్ సలాడ్ లేకుండా న్యూ ఇయర్ పార్టీ ఉండదు.ఛొబ్బియ్ రోఆమ్ అంటూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు.
3.ఆస్ట్రేలియా(సిడ్నీ) – దాదాపు 15 లక్షలమంది సిడ్నీ హార్బర్‌లో హాజరయ్యే వేడుక ఇది.యూరోపియన్ సెటిలర్స్ ప్రవేశపెట్టిన గ్రొగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ వేడుకలను డిసంబర్ 31న జరుపుకుంటారు సిడ్నీ ప్రజలు.పెద్ద యెత్తున పటాకాలు కాలుస్తారు,చక్కటి సంగీతంతో పాటు సాంప్రదాయక వైన్ తీసుకుంటారు.
4.జపాన్ – గ్రొగేరియన్ క్యాలెండర్ ప్రకారం 1873 సంవత్సరం నుండి జనవరి ఒకటిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు జపనీయులు.ఒసేబీ అనే ఆహార పదార్థాన్ని ప్రత్యేకంగా తయారుచేసి ఆరగిస్తారు వీరు న్యూ ఇయర్ ఈవ్ రోజున.ప్రత్యేకించి బియ్యంతో వండిన మోచి అనే పదార్థాన్ని కూడా తీసుకుంటారు జపనీస్.బుద్ధిస్ట్ టెంపుల్‌లో 107 గంటలు రాత్రి పన్నెండింటి వరకు మ్రోగించి 108వ గంటను తెల్లవారి మొదటి నిమిషంలో మ్రోగిస్తారు.హైకూలు,పోయెట్రీ చదవడం వీరి న్యూ ఇయర్ స్పెషల్.
5.చైనా – లూనార్ న్యూ ఇయర్‌ను జరుపుకునే చైనీయులు గ్రెగోరియన్ క్యాలెండర్ న్యూ ఇయర్ ను కూడా సెలబ్రేట్ చేసుకుంటారు.రాక్ మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతాయి ఇక్కడ దాంతో పాటుగా ఫైర్ వర్క్ కాల్చడం ఇక్కడ ఆనవాయితి.బీజింగ్ మిలీనియం మాన్యుమెంట్‌లో కల్చరల్ షోస్ జరుగుతాయి.షాంఘైలోని ద బండ్ లో అర్ధ రాత్రికి కొన్ని నిమిషాల ముందు లైట్ ఆండ్ మ్యూజిక్ షో జరుగుతుంది.
6.థాయ్ ల్యాండ్ – స్నేహితులు కుటుంబసభ్యులు కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు థాయ్ ప్రజలు.సెంట్రల్ వరల్డ్ స్కేర్‌లో,బ్యాంకాక్‌లోని ఛావో సాన్యా రివర్,పట్టయ్యా బీచ్ మొదలగు ప్రదేశాల్లో ఈవ్ పార్టీస్ జరుగుతాయి.ఫుడ్,ఎంటర్‌టైన్‌మెంట్,మ్యూజిక్ ప్రధానంగా ఉంటాయి ఈ పార్టీల్లో.పబ్లిక్ ప్రదేశాల్లో కూడా జరిగే ఈ పార్టీలు తెల్లవారేవరకు జరుగుతాయి.
7.భారత్ – సాంప్రదాయక నూతన సంవత్సర వేడుకలు ఒక్కో ప్రాంతానికి ఒక్కో నెలలో జరిగినా జనవరి ఒకటిని అందరూ ఫుల్ జోష్‌తో ఆహ్వానిస్తారు. గోవా, బెంగళూరు, ముంబయి, ఢెల్లి, కోల్‌కతా, పాండిచ్చేరి, గుల్‌మార్గ్,కేరళ,హిమాచల్‌లోని మెక్‌లియోడ్ గంజ్ ప్రాంతాల్లో ఈవ్ పార్టీలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. నైట్‌క్లబ్స్, అమ్యూజ్‌మెంట్ పార్కులు,రెస్టారెంట్లలో థీమ్ పార్టీస్ కూడా జరుగుతాయి. మెసేజ్‌లు పంచుకోవడం ఇక్కడ ఆనవాయితీ.బరువు తగ్గాలి, చెడ్డ అలవాటు ్ల వదిలేస్తాను, కష్టపడి పని చేస్తాను అనే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకోవడం ఇండియాలో ఎక్కువ.మీడియాలో పెద్దఎత్తున కార్యక్రమ ప్రసారాలు చేయడం కూడా భారత్‌లో ఎక్కువ.