Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సివిల్స్ ఫలితాలు విడుదల

  • కర్ణాటకకు చెందిన కె.ఆర్.నందినికి ఫస్ట్ ర్యాంకు

Civils-Topper

హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్సీ) నిర్వహించిన సివిల్స్ -2016 తుది ఫలి తాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో కర్ణాటకకు చెందిన కె.ఆర్.నందిని జాతీయ స్థాయి లో ప్రథమ స్థానంలో నిలిచారు. అన్మోల్ షేర్‌సింగ్ బేడీ ద్వితీయ స్థానం, గోపాలకృష్ణ రోనన్కి తృతీయ స్థానం సాధించారు. టాప్ 10 ర్యాంకుల్లో ముగ్గరు అమ్మాయిలు ఉన్నారు. మొత్తం 1,099 మంది అభ్యర్థు లు ఎంపికైనట్లు యుపిఎస్సీ వెల్లడించింది. అందులో 846 మంది పురుషులు, 253 మంది మహిళలు, 44 మంది వికలా ంగులు ఉన్నారు. వీరిలో 500 జనరల్ కేటగిరీలో ఎంపిక కాగా, 347 మంది ఒబిసిలు, 163 మంది ఎస్సీలు, 89 మంది ఎస్టీ విభాగాలలో ఎంపికయ్యారు. సివిల్స్ పరీక్షను యుపిఎస్సీ గత ఏడాది ఆగస్టు 7వ తేదీన నిర్వహించిన ప్రిలిమనరీకి 11,35,943 మంది దరఖాస్తు చేసుకోగా, 4,59, 659 మంది హాజరయ్యారు. అందులో 15,452 మంది మెయిన్స్ డిసెంబర్‌లో పరీక్షలకు హాజర య్యారు. అందులో 2,961 మంది ఇంటర్వూలు ఎంపికకాగా, వారికి ఈ ఏడాది మార్చి-మే నెలల్లో ఇంటర్వూలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆనంద్ వర్థన్ 7వ ర్యాంకు సాధించగా, రాష్ట్రానికి చెందిన రిటైర్ ఐపిఎస్ అధికారి ఎ.కె.ఖాన్ కుమారుడు ముజ మిల్ ఖాన్ జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించారు. పి.అన్వేష్‌రెడ్డి 80వ ర్యాంకు, సురుచి చౌదరి 152వ ర్యాంకు, కర్నాటి వరుణ్‌రెడ్డి 166వ ర్యాంకు, బాలలత 167వ ర్యాం కు, పవన్‌కుమార్‌రెడ్డి 353వ ర్యాంకు, అవినాష్ 502వ ర్యాంకు, శ్రీకాంత్‌రెడ్డి 519 ర్యాంకు, యశ్వంత్‌రావు 531వ ర్యాం కు, సునీతా చౌదరి 862వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది ఇంటర్వూకు హాజరుకాగా, అందులో 80 మంది వరకు సివిల్స్‌కు ఎంపి కైనట్లు తెలిసింది.
సివిల్ ఇంజనీర్‌కు ఫస్ట్ ర్యాంకు : సివిల్స్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో ప్రథ మ ర్యాంకు సాధించిన కె. ఆర్.నందిని, బెంగుళూరు లోని రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి నుంచి బి.ఇ (సివిల్ ఇంజనీరింగ్) పూర్తి చేసింది. ఒబిసి కేటగి రీకి చెందిన నందిని కన్నడ లిటరేచర్‌ను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. రెండవ ర్యాంకు సాధిం చిన అన్మోల్ షేర్‌సింగ్ బేడీ బిట్స్ పిలాని నుంచి బి.ఇ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. టాప్ 25 ర్యాంకులలో 18 మంది పురుషులు ఉండగా, 7 మంది మహిళలు ఉన్నారు. ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ఐఎస్‌బి, బిట్స్ పిలాని, విఐటి, ఎంఎస్‌ఆర్‌ఐటి, డిసిఇ, డియు, అన్నా యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠా త్మక విద్యాసంస్థల్లో విద్యనభ్య సించిన వారే జాతీ య స్థాయిలో టాప్ 25 ర్యాంకుల్లో నిలిచారు.

టాప్ టెన్ ర్యాంకర్లు వీరే :

  1. నందిని కె.ఆర్
  2. అన్మోల్ షేర్ సింగ్ బేడి
  3. గోపాలకృష్ణ రోణంకి
  4. సౌమ్య పాండే
  5. అభిలాష్ మిశ్రా
  6. కొత్తమాసు దినేష్‌కుమార్
  7. ఆనంద్ వర్ధన్
  8. శ్వేతా చౌహాన్
  9. సుమన్ సౌరవ్ మహంతి
  10. బిలాల్ మెహి ఉద్ డిన్ భట్

Comments

comments