Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

నాగచైతన్య, సమంత అసలు పెళ్లి చేసుకుంటారా?

Naga Chaitanya and Samantha Marriage News

చైతు, సామ్ ల ఎంగేజ్ మెంట్ జరిగి చాలా రోజులయినప్పటికీ… వీళ్ల పెళ్లి గురించి మాత్రం తమ అభిమానులకు ఇప్పటి వరకూ ఓ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇండస్ట్రీలో చాలా గుసగుసలు స్టార్ట్ అయ్యాయట.

ఇదివరకు తన తమ్ముడు అఖిల్ మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి సామ్, చైతుల పెళ్లి పై పడింది. కాని… ఈ జంట మాత్రం పెళ్లి గురించి అస్సలు ఆలోచించట్లేదట.

ఇప్పుడు వాళ్లిద్దరూ తమ తమ సినిమాల్లో బిజీ బిజీ అయిపోయారట. వాళ్ల ఎంగేజ్ మెంట్ తర్వాత కూడా ఇద్దరు చెరో రెండు సినిమాలకు సైన్ చేశారు. అయితే.. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత పెళ్లి ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. కాని.. సీన్ రివర్స్ అయింది.

ఎలా అంటే… చైతన్య… ఇప్పటికే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించాడు. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక, మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తుంది. అయితే.. చందు మొండేటి తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట చైతూ. అంతే కాదు.. ప్రేమమ్ మూవీ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ మూవీ లోనూ చైతూ నటించనున్నాడట. ఈ సినిమాలన్నీ పూర్తవడానికి దాదాపు ఓ సంవత్సరమైనా పడుతుంది. మరి పెళ్లి ఎప్పుడు? ఈ సినిమాలు అయిపోయిన తర్వాతనా? లేక.. షూటింగ్ ఆపి పెళ్లి చేసుకుంటారా? అనే విషయంపై మాత్రం ఇంకా చైతూ క్లారిటీ ఇవ్వలేదు.

ఇక సమంత విషయానికి వస్తే…నాగార్జునతో రాజు గారి గది2, రామ్ చరణ్ తో మరో మూవీలో నటిస్తుంది. అంతే కాదు.. తమిళ్ లో విజయ్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. విశాల్ సినిమాలోనూ హీరోయిన్ గా నటించనుంది. మరి.. ఈ సిినిమాల షూటింగ్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి దాదాపు ఓ సంవత్సరం పట్టొచ్చు.

ఇద్దరూ సినిమాల్లో బిజీ బిజీ గా ఉండటం, అస్సలు పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో ఇప్పట్లో పెళ్లి లేనట్లే అని అటు నాగ్ అభిమానులు, ఇటు సామ్ అభిమానులు తెగ వర్రీ అవుతున్నారట. షూటింగ్స్ అన్ని మధ్యలో ఆపి పెళ్లి చేసుకుంటారా? లేక.. మూవీస్ షూటింగ్ అంతా అయిపోయాక పెళ్లి చేసుకుంటారా? అనేది తెలియాలంటే ఇక వాళ్ల నుంచే క్లారిటీ రావాలి.

Comments

comments