Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

భారత్ కంటే మెరుగ్గా బంగ్లా, నేపాల్, భూటాన్

Global-Health

‘గ్లోబల్ బర్డెన్ డిసీజ్’ పేరిట ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌ఒ) విడుదల చేసిన ఆరోగ్య సూచిలో భారత్ 154వ స్థానంలో నిలిచింది. 195 దేశాలతో కూడిన ఈ నివేదికలో పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ కంటే భారత్ వెనుకబడి ఉండటం గమనార్హం. 1900 నుంచి 2015 మధ్య కాలంలో ఆరోగ్య స్థాయిలను అంచనావేసి, ఆయ దేశాలు సాధించిన లక్ష్యాల మదింపు చేసి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించడం విశేషం.

ఈ నివేదిక ప్రకారం 1990లో 30.7 పాయింట్లతో ఉన్న ఇండియా 2015 నాటికి 44.8 పాయింట్లకు చేరుకుంది. కాగా ఇది క్షయ, మూత్రపిండాలు, గుండె, డయాబెటిస్ వ్యాధుల్లో ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. అయితే పొరుగు దేశాలైన చైనా 74, శ్రీలంక 72.8, భూటాన్ 52.7, బంగ్లాదేశ్ 51.7, నేపాల్ 50.8 పాయింట్లతో మన కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ నివేదికలో దాయాది పాకిస్థాన్ మాత్రం మన కంటే వెనుకబడి ఉంది.

Comments

comments