Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

అనిల్‌మాధవ్ దవే అంత్యక్రియలు పూర్తి

DAVE

భోపాల్ : గురువారం హఠాన్మరణం చెందిన కేంద్రమంత్రి అనిల్‌మాధవ్ దవే అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని బంద్రభన్ నర్మదా నదీ తీరాన ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. దవే పార్థివ దేహానికి మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్, కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, ఉమాభారతి, అనంత్‌కుమార్, నరేంద్రసింగ్ తోమర్, థావర్‌చంద్ గెహ్లోట్ , ఆర్‌ఎస్‌ఎస్ నేత జోషితో పాటు పలువురు నివాళులు అర్పించారు. దవే మృతికి సంతాపంగా మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తామని సిఎం చౌహాన్ తెలిపారు.

Comments

comments