Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

బాహుబలి-2 @ 1500 కోట్లు

Bahubali-2

హైదరాబాద్: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం బాహుబలి-2 ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ 1500 కోట్లు సాధించిన తొలి ఇండియన్ మూవీగా మరో అరుదైనా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఇంతా భారీ విజయాన్ని అందించిన సినీ అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.

విడుదలైనా మూడు వారాల్లోనే బాహుబలి-2 రూ. 1500 కోట్ల మార్క్ ను అందుకోవడం మరో విశేషం. ఇంతకుముందు వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి-2 నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత దంగల్ మూవీ ఈ జాబితాలో చేరింది. ప్రస్తుతం దంగల్ 1200 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ఉండగా, బాహుబలి-2  రూ. 1502 కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఇక పూర్తి రన్ టైమ్ లో బాహుబలి మరెన్ని రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాలి.

Comments

comments