Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

రిస్కీ స్టంట్స్‌తో అదరగొట్టాడు

balaiahబాలకృష్ణ సినిమాల్లోని డైలాగులు, ఫైట్లు చూసి అభిమానులు ఉప్పొంగిపోతారు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఆ పల్స్ పట్టుకోగలిగాడు కాబట్టే బాలయ్యతో సింహా, లెజెండ్ వంటి రెండు బంపర్ హిట్లు కొట్టాడు. గౌతమిపుత్ర శాతకర్ణితో 100 సినిమాల మైలురాయిని దాటిన ఈ సీనియర్ స్టార్ హీరో తన 101వ చిత్రాన్ని ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో చేస్తున్నాడు. ఇక పూరి సినిమాల్లో హీరో క్యారెక్టర్లంతా కాస్త డిఫరెంట్‌గానే ఉంటాయి. మరి బాలయ్యను పూరి జగన్నాథ్ ఎలా చూపిస్తాడా అని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పూరి తన సినిమాలకు డైలాగ్స్ తానే రాసుకుంటాడు. సినిమా ఫలితం ఎలాగున్నా పూరి డైలాగులకు మాత్రం మంచి పేరొస్తుంది. ఇక ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా డైలాగులు చెప్పడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా. ప్రస్తుతం చేస్తున్న మూవీలో డైలాగ్స్‌తో పాటు ఫైట్స్ విషయంలోనూ ఎక్కడా రాజీపడకూడదని పూరి నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ సినిమాకు హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్‌లో కొనసాగుతోంది. దాదాపు 40 రోజుల పాటు అక్కడ చిత్రీకరణ జరుగనుంది. తాజాగా హీరో బాలకృష్ణతో రెండు రిస్కీ స్టంట్ సీన్స్ తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమా కథలో ఇవే కీలకమైన సన్నివేశాలు కావడంతో 57 ఏళ్ల వయసులోనూ బాలయ్య రిస్క్ తీసుకొని మరీ ఈ ఫైట్స్ చేశాడని అంటున్నారు. రెండు పాటలతో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక సినిమా యూనిట్ ఇండియాకు తిరిగి రానుంది.

Comments

comments