Search
Tuesday 19 June 2018
  • :
  • :

కొత్త సచివాలయానికి బైసన్ పోలో గ్రౌండ్?

రక్షణశాఖతో స్థల మార్పిడికి అవకాశం
ఢిల్లీలో ఉన్న గవర్నర్ నరసింహన్ సహకారం

poloహైదరాబాద్: తెలంగాణ కొత్త సచి వాలయ నిర్మాణం అంశం మరోసారి తెర మీదికి వచ్చిం ది. ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థానంలో నూతన సచి వాలయాన్ని నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందు కోసం గత కొన్ని నెలలుగా కసరత్తు చేసి చివరకు సికిం ద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ సమీపంలోని బైసన్ పోలో మైదా నాన్ని ఎంపిక చేసుకుంది. సుమారు 60 ఎకరాల విస్తీ ర్ణం ఉన్న ఈ మైదానం కేంద్ర రక్షణశాఖది కావడంతో గత ఏడాదిగా ఈ స్థలం తమకు అప్పగించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. సిఎం  కెసిఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా పనిలో పనిగా ఈ స్థల అంశాన్ని ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంలోనూ సిఎం ప్రధాని నరేంద్ర మోడీతోనూ, అలాగే ప్రస్తుత కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయి స్థలం అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని విన్నవించారు. ఈ ప్రతిపాదనపై కేంద్రం చూసి చూడనట్లుగా వ్యవహరి స్తుండడంతో ఈ స్థలంపై మరింత ఒత్తిడిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని యత్నాలు చేస్తున్నది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కేంద్ర పెద్దల వద్ద బైసన్ పోలో గ్రౌండ్ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారని సమాచారం. ఈ స్థలంతో పాటు సికింద్రా బాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు అవసరమైన స్థలాలు కూడా అప్పగించాలని ఆయన కోరారు. మొత్తం 160 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని గవర్నర్ నివేదించారు. అటు ప్రభుత్వం నుండి, ఇటు గవర్నర్ నుండి ఒత్తిళ్లు మరింత పెరగడం తో రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకారం తెలి పేందుకు, అలాగే ఆ లోటును రక్షణ శాఖ భర్తీ చేసుకునేందుకు ఉన్న అం శాలను స్థూలంగా చర్చించింది. రాజధాని హైదరాబాద్ పరిధిలోనే భూ మికి భూమి, లేదా మార్కెట్ విలువ ప్రకారం అంతే విలువైన భూమిని జిల్లాల్లో అయినా సరే పొందాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న గవర్నర్ నరసింహన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి రక్ష ణ శాఖ అధికారులు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం వెనువెంటనే తన సమ్మతిని కేంద్రానికి తెలియచేసింది. వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక వెయ్యి ఎకరాలు, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సమీపంలో ఉన్న 500 ఎకరాలతో పాటు నగర శివారులో మరో 150 ఎకరాల భూమిని రక్షణ శాఖకు అప్పగిస్తామని చెప్పింది. రాష్ట్రపతి నిలయం సమీపంలోని 500 ఎకరాల భూమి కొన్ని సంవత్సరాల నుంచి రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. రక్షణ శాఖ నుంచి తీసుకోనున్న 160 ఎకరాల భూమి విలువ, వారికి అప్పగించనున్న భూముల విలువను లెక్కించి ఒక అంచనాకు వచ్చిన తరువాతే తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రక్షణ శాఖ భూమిలో మరో రెండు భారీ ఫ్లై ఓవర్లు ! : సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుండి బోయిన్‌పల్లి వరకు, జూబ్లి బస్‌స్టేషన్-కరీంనగర్ రహదారిలో షామీర్‌పేట జంక్షన్ వరకు 10 కి.మీ నిడివితో కొత్తగా రెండు భారీ ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ల నిర్మా ణం, రోడ్ల విస్తరణలో రక్షణశాఖకు చెందిన భూములు ఉన్నాయి. ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం సుమారు 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసు కోవాల్సి ఉంటుంది. ఇక్కడ కోల్పోయో భూములకు పరిహారంగా అంతే విలువ కలిగిన భూమిని నగర శివార్లలో ఇవ్వాలని రక్షణశాఖ కోరింది.
వికారాబాద్, వనపర్తిలో ఫైరింగ్ జోన్ : ఆర్మీలో నూతనంగా నియమితులైన జవాన్ల శిక్షణ కోసం వికారాబాద్, వనపర్తిలో ఒక వేయి ఎకరాలను ఫైరింగ్ జోన్ కోసం ఇవ్వనున్నారు. వికారాబాద్‌లో 500 ఎకరాలు, వనపర్తిలో 500 ఎకరాల చొప్పున జిల్లా కలెక్టర్లు ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఒకటి రెండు రోజుల్లో రక్షణశాఖ ఉన్నతాధికారులు ఈ స్థలాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక అందచేయనున్నారు.

Comments

comments