Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

పెళ్లైన కొన్ని గంటలకే పరారైన పెళ్లి కొడుకు

Marriage

కర్నూలు: పెళ్లై కొన్ని గంటలు కూడా గడవక ముందే అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను వదిలి పెళ్లి కొడుకు పరారైన ఘటన ఎపిలోని కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాలో చోటుచేసుకుంది. దీంతో వధువు తరపు వాళ్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  ఘటన వివరాల్లోకి వెళితే… స్థానికంగా ఉండే వెంకటస్వామి కుమార్తె మోతె లక్ష్మీకి తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరానికి చెందిన కురుమూర్తితో బుధవారంనాడు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లైన అనంతరం రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా వరుడు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

ఇది గుర్తించిన వధువు కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో వధువు తరపు వాళ్లతో పాటు వరుడి తరపు వాళ్లు కూడా చుట్టూ పక్కల చాలాసేపు గాలించారు. కానీ కురుమూర్తి ఆచూకీ మాత్రం దొరకలేదు. తరువాతి రోజు కూడా అతడి కోసం ఎదురుచూసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలాఉండగా కురుమూర్తికి ఇదివరకే పెళ్లి అయినట్లు మొదటి భార్య కూడా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Comments

comments