Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

నెక్లెస్‌రోడ్‌లో కారు బీభత్సం

Car-Accident

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో కారు బీభత్సం సృష్టించింది. మే 18 అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం నుంచి ఓ ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. జేమ్స్ స్ట్రీట్‌కు చెందిన భానుకిరణ్ తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు పిల్లలతో కలిసి ఓ హోటల్ భోజనం చేశారు. అనంతరం ఐస్‌క్రీమ్ తినేందుకు నెక్లెస్‌రోడ్‌కు వెళ్తూ జలవిహార్ ముందు స్పీడ్ బ్రేకర్ రావడంతో కారు స్లో చేశారు.

అయితే ఇదే సమయంలో మద్యం సేవించి ఉన్న యువకులు మరో కారును వేగంగా తీసుకువచ్చి భానుకిరణ్ కారును బలంగా ఢీకొట్టారు. దీంతో భానుకిరణ్ కారు ఎడమ వైపు ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌ను ఢీకొట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కారులోని పిల్లలను బయటకు తీశారు. కాగా మద్యం మత్తులో కారు నడిపిన యువకుల ఇన్నోవా కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. కారులోని యువకులను స్థానికులు పోలీసులకు అప్పగించారు.

Comments

comments