Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

చైనా నోట పంచశీల మాట

చైనా-పాక్ కారిడార్‌పై భారత్ ఆందోళనతో ప్రస్తావన

panchsheelబీజింగ్: ఆక్రమిత కశ్మీర్‌లో నిర్మించనున్న చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవ (సిపిఇసి)కు వేరే పేరు పెడతారా? అన్న ప్రశ్నకు చైనా జవాబివ్వకుండా దాటవే సింది. పైగా ‘పరస్పర ప్రాంతీయ సమగ్రత, సార్వ భౌమాధికారాన్ని బలపరిచే  పంచశీల సూత్రాలకు కట్టుబడి ఉన్నాం’ అని చెప్పిం ది. భారత్, చైనాలు తొలిసారిగా పంచశీల సూత్రాలను 1954లో ప్రకటించాయి. న్యూ ఢిల్లీలో ఇటీవల మేధావు లతో జరిగిన సమావేశంలో భారత్‌లో ఉన్న చైనా రాయ బారిలువో జహూ యి ప్రసంగిస్తూ చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవకు వేరే పేరు పెట్టడా నికి సిద్ధ మేనన్నారు. కానీ దీనిపై పాకిస్థాన్ స్పష్టత కోర గానే ఆయన ప్రసంగం నుం చి ఆ వ్యాఖ్యానాన్ని తొలగించి చైనా తన వెబ్ సైట్‌లో పెట్టింది. పైగా అది భారత్ ఆందోళ నలను దూరం చేయడానికి  లువో  చేసిన వ్యక్తిగత అభిప్రా యాలు అని పేర్కొంది. ఇదిలా ఉండగా బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఓ వార్తాపత్రికలో రాసిన ఆర్టికల్‌లో సిపిఇసి భారత బలహీనత (ఆచి ల్లెస్ హీల్) అని పేర్కొన్నారు. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్‌ను ప్రశ్నించగా…తాము పంచ శీల సూత్రాలకు కట్టుబడి  ఉన్నామని, పరస్పర ప్రాంతీయ సమగ్రత, సార్వ భౌమాధికారాన్ని మన్నించేలా  వ్యవహరి స్తామని చెప్పారు. స్నేహబంధం, సహజీవ నాన్ని పంచశీల పెంపొందిస్తుందన్నారు.  కశ్మీర్ ప్రాంతానికి సంబంధిం చినంత వరకు చైనా వైఖరిలో మార్పులేదన్నారు. కశ్మీర్ భారత్, పాకిస్థాన్‌ల సమస్య అన్నా రు. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు చైనా వైఖరి మార్చదన్నారు.  ఆక్రమిత కశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవ నిర్మిస్తుండ డంతో తన సార్వ భౌమాధికార విషయం పై భయాందోళనలు వ్యక్తం చేసిన భారత్ మే 14-15 తేదీల్లో జరిగిన బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్(బిఆర్‌ఎఫ్) సదస్సుకు హాజరు కాలేదన్నది తెలిసిన విషయమే.

Comments

comments