Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

కేన్స్‌లో మెరిసిన దీపిక …హొయలొలికించిన మల్లికా

Cannesసినీ తారల తళుకు బెళుకుల మధ్య ప్రతిష్టాత్మకమైన 70వ కేన్స్ చలన చిత్రోత్సవం ఆరంభమైంది. తొలిరోజున బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునే రెడ్ కార్పెట్‌పై  మెరిసి మురిపించింది. ఈ చిత్రోత్సవంలో మొదటిరోజున ర్యాంప్ వాక్ చేసిన తొలి భారతీయ నటి ఆమె కావడం విశేషం. అంతేకాకుండా దీపిక తొలిసారిగా కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొంది.  పర్పుల్ రంగు మార్చెసా గౌనులో ఈ భామ సందడి చేసింది. ఆమె ధరించిన అందమైన చెవి రింగులు, ఉంగరం, కళ్లకు నీలి రంగు మేకప్ హైలైట్‌గా నిలిచాయి. అనంతరం బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. ఈ భామ తెలుపు రంగు పొడవాటి గౌనులో హొయలొలికించింది. ఇదిలాఉండగా బాలీవుడ్ అందాల రాణి ఐశ్వర్యారాయ్ గత 15 ఏళ్లుగా కేన్స్ ఉత్సవాలకు హాజరవుతోంది. ఈసారి కూడా ఈ చిత్రోత్సవంలో పాల్గొనేందుకు ఐష్ బుధవారం రాత్రి తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ముంబయ్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ వేడుకలో ఆమె నటించిన ‘దేవ్‌దాస్’ (2002) చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఐష్‌తో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌కపూర్ కూడా కేన్స్‌లో సందడి చేయనుంది. అయితే ఈ చిత్రోత్సవంలో సౌతిండి యా సినీ ఇండస్ట్రీ నుంచి శృతిహాసన్ పాల్గొనబోతోంది.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న తమిళ చిత్రం ‘సంఘమిత్ర’ లో ఆమె నటించనుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను కేన్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. మే 28 వరకు జరిగే కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకల్లో పలువురు హాలీవుడ్ స్టార్లు సందడిచేయబోతున్నారు.

Comments

comments