Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

ప్రముఖ నటుడు కె.కె.శర్మ మృతి

KK-Sharma

హైదరాబాద్ : ప్రముఖ తెలుగు సినీ నటుడు కన్నెపల్లి కామేశ్వర శర్మ (కె.కె.శర్మ) గురువారం మృతి చెందారు. 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ‘కంచుకోట‘ సినిమాతో ఆయన తొలిసారిగా వెండి తెరకు పరిచయమయ్యారు. మయూరి, స్త్రీ వంటి చిత్రాల్లో ఆయన నటనతో ఆకట్టుకున్నారు. చిత్రసీమకు రాకముందు రైల్వే శాఖలో పనిచేసేవారు. సినిమాలపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్ర రంగంలో స్థిరపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో శర్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కెకె శర్మ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Comments

comments