Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

ధర్నా చౌక్ కోసం పోరాటం : కోదండరాం

Kodandaram

మహబూబ్‌నగర్ : ధర్నా చౌక్ కోసం తమ పోరాటం కొనసాగుతుందని టిజెఎసి కన్వీనర్ కోదండరాం స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ధర్నా చౌక్ పట్ల వ్యతిరేకతుందని చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ధర్నా చౌక్ ఆందోళన విషయంలో పోలీసులు ఏకపక్షం వహించారని చెప్పారు. అఖిలపక్షం చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను పరిష్కరించకుండా వ్యక్తిగత దాడులకు దిగడం పాలకుల అనైతికతకు నిదర్శనమన్నారు. ధర్నా చౌక్ వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణను, పరిరక్షణ కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

Comments

comments