Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

గంభీర్ ఆనందోత్సాహం..

gambhirబెంగళూరు: కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైద రాబాద్‌ను ఓడించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ గతం లో ఎన్నడూ లేనంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వర్షం వల్ల మ్యాచ్ జరుగుతుందా లేదా అనుమానల నేపథ్యంలో కొంత నిరాశకు గురైన గంభీర్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఉద్వేగానికి గుర య్యాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా కనీసం చిరునవ్వు కూడా ఇవ్వని గంభీర్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకు న్నాడు. గాల్లోకి పంచ్‌లు విసురుతూ, బిగ్గరగా అరుస్తూ ఆనందంలో మునిగి పోయాడు. గతంలో ఎప్పుడూ కూడా గంభీర్‌లో ఇంత ఉత్సాహం కనిపించలేదు. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే కోల్‌కతా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వర్షం తగ్గి న తర్వాత మ్యాచ్‌ను ఆరు ఓవర్లకు కుదించారు. దీంతో కోల్‌కతా 48పరుగుల లక్ష్యాన్ని ఛేదించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. జట్టును ముందుండి గెలిపించిన గంభీర్ మ్యాచ్ అనం తరం చాలా ఆనందంగా కనిపించాడు. కిందటి సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి కోల్‌కతా ఈసారి ప్రతీకారం తీర్చుకుంది.

Comments

comments