Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

పునాదుల్లో బంగారు నాణేలు

GOLD-COINS

బెంగళూరు : లక్ష్మమ్మ అనే పేద మహిళ ఇంటి నిర్మాణం కోసం కూలీలతో పునాదులు తవ్విస్తుండగా 435 బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఈ ఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాణ సముద్ర అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి కోసం తవ్వుతున్న పునాదుల్లో లభ్యమైన 435 బంగారు నాణేలను అమ్ముకొని హాయిగా ఉండమని ఇరుగుపొరుగు ఆమెకు చెప్పారు. కానీ లక్ష్మమ్మ మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా లభ్యమైన బంగారు నాణేలపై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ బంగారు నాణేలను స్వాధీనం చేసుకుని పరిశీలన కోసం పురావస్తు శాఖకు అప్పగించారు. ఇంటి పునాదుల్లో లభించిన బంగారు నాణేలను దాచుకోకుండా నిజాయితీగా పోలీసులకు అప్పగించిన లక్ష్మమ్మను ఇప్పుడు పోలీసులతో పాటు ఆ గ్రామ ప్రజలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Comments

comments