Search
Friday 20 April 2018
  • :
  • :

వినియోగదారులకు అనుకూలంగా జిఎస్‌టి బిల్లు

Arun-Jaitley1

శ్రీనగర్ : జిఎస్‌టి బిల్లు వినియోగదారులకు అనుకూలంగా ఉంటందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. శుక్రవారం శ్రీనగర్‌లో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్య, ఆరోగ్య సేవలను జిఎస్‌టి నుంచి మినహాయించినట్లు ఆయన వెల్లడించారు. ఎసి లేని హోటళ్లను 12శాతం పన్ను రేటు పరిధిలో చేర్చామన్నారు. మద్యం సరఫరా చేసే అనుమతి కలిగిన ఎసి రెస్టారెంట్లను 18శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. ఫైవ్‌స్టార్ రెస్టారెంట్లకు కూడా జిఎస్‌టి హోటల్ పరిధిలోనే ఉంటుందని, పాలు, తృణ ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను జిఎస్‌టి బిల్లు నుంచి మినహాయించినట్లు ఆయన తెలిపారు.

Comments

comments