Search
Tuesday 19 June 2018
  • :
  • :

చర్చి ఎదుట హిందూ యువ వాహిని కార్యకర్తల ఆందోళన

Hindu-Yuva-Vahini

భందోహి: యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినికి చెందిన కొందరు కార్యకర్తలు శుక్రవారం ఓ చర్చి ఎదుట ఆందోళన చేపట్టారు. దళితులను బలవంతంగా మతం మార్పిస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. సంత్ రవిదాస్ నగర్ జిల్లా ఔరాయి తాలూకా తియూరి గ్రామంలోని ఓ ఇంటిలో చర్చి నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్చి పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పాస్టర్‌ను కేరళకు చెందిన అజ్మన్ అబ్రహామ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాగా తియూరి గ్రామంలోని ఆ చర్చిలో గత కొన్నాళ్లుగా బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతోనే తామే చర్చికి వెళ్లి ఆందోళన చేయాల్సివచ్చిందని యువవాహిని జిల్లా ప్రెసిడెంట్ సుభాష్ శర్మ మీడియాతో అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments