Search
Friday 20 April 2018
  • :
  • :

మాజీ భార్య కోసం …

Hrithik

ముంబయి : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య కోసం ముంబయిలో 25 కోట్లు వెచ్చించి ఓ ప్లాట్ తీసుకున్నాడు. హృతిక్ రోషన్ తన భార్య సూసాన్‌ఖాన్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. వారు విడిపోయినప్పటికీ పిల్లల కోసం అప్పుడప్పుడు వారు పార్టీలకు, విహారయాత్రలకు వెళుతుంటారు. అయితే ఇప్పుడు తన మాజీ భార్య సూసాన్ ఖాన్ కోసం తాను ఉంటున్న జుహు ప్రాంతానికి సమీపంలోనే ఓ ప్లాట్ తీసుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. భార్యతో విడిపోయినప్పటికీ, ఆమె ఆలనాపాలనా చూస్తున్నాడంటూ బాలీవుడ్ హృతిక్ రోషన్‌ను తెగ పొగిడేస్తోంది.

Comments

comments