Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

బకాయిలు తక్షణమే చెల్లించండి

ఐదుగురు పన్ను ఎగవేతదారుల పేర్లను వెల్లడించిన ఐటి శాఖ

taxన్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులపై ఆదాయం పన్ను శాఖ కొరడా ఝులిపించింది. నేమ్ అండ్ షేమ్ పేరిట భారీగా రూ.10 కోట్లకు పైగా పన్ను ఎగవేససిన ఐదుగురి పేర్లను బహిర్గతం చేసింది. దీనిలో భాగంగా రూ .10 కోట్లకుపైగా పన్నులు చెల్లించని ఢిల్లీకి చెందిన ఐదు సంస్థల పేర్లను ప్రచురించింది. ఆదాయ పన్ను,కార్పొరేట్ టాక్స్ చెల్లించాల్సిన జాబితాను ప్రధాన జాతీయ దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలోఐటీశాఖ విడుదల చేసింది. పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని ఐటి కోరింది. నేమ్ అండ్ షేమ్ పేరిట ఎగవేతదారుల పేర్లను బహిర్గతం చేసే పథకాన్ని ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డు (సిబిడిటి) గత కొన్ని సంవత్సరాల క్రితం చేపట్టింది. దీనిలో భాగంలో గతంలో 96 సంస్థలు గుర్తించింది.  ఇవి  గుర్తించలేకుండా లేదా రికవరీ కోసం ఎలాంటి ఆస్తులు లేకుండా మిగిలిపోయాయి. ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జారీ చేసిన ఒక నోటీసు లో ఈ జాబితాను వెల్లడి చేశారు. పాన్ కార్డు సంఖ్య, చివరిగా తెలిసిన చిరునామా, అంచనా పరిధి,  పన్ను చెల్లించని మొత్తాన్ని, వ్యక్తిగత, సంస్థల వివరాలతో వెల్లడించినట్టు అధికారి ఒకరు చెప్పారు.   అయితే ఈ సంస్థల చిరునామా, వ్యాపారం, వాటాదారుల నిర్వహణ మరియు నిర్వహణ వంటివి మారవచ్చు. ఈ సంస్థల గురించి సమాచారం తెలిసిన వారు,  ఉపయోగకరమైన సమాచారం ఉంటే తమకు తెలియపర్చాల్సిందిగా  కోరారు. కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్లీన్‌మనీ వెబ్‌సైట్‌ను  మంగళవారం ప్రారంభించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూర్చేలా , పన్ను చెల్లింపులకు ప్రజలను ప్రోత్సహించేలా ఈ పోర్టల్‌ను లాంచ్ చేసినట్టు చెప్పారు.

Comments

comments