Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

పాక్ అణు స్థావరం గుట్టు బట్టబయలు

                       Land-Mark

న్యూఢిల్లీ: పాకిస్థాన్ రహస్యంగా నిర్మిస్తున్న అణ్వాయుధాల నిల్వ స్థావరం వివరాలు బట్టబయలయ్యాయి. ఖైబర్ కనుమల్లోని హరిపూర్ పర్వత శ్రేణుల్లో పాకిస్తాన్ దీన్ని నిర్మిస్తున్నట్టు గుర్తించారు. నిర్మిస్తున్నారు. బాహ్య ప్రపం చానికి తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఉపగ్రహలకు వాటి చిత్రాలు చిక్కాయి. వాటిని సైనిక నిఘా సంస్థలు విశ్లేషించి అది కచ్చితంగా అణ్వాయు ధాల నిల్వ స్థావరమేనని ధృవీకరిం చాయి. ఈ ప్రాంతంలో పాక్ షాహిన్-3 క్షిపణులను మోహరించింది. ఈ క్షిపణులకు 2750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉంది. దీని సాయంతో భారత్‌లోని అండమాన్ దీవులపై కూడా దాడి చేయవచ్చు.

ఈ స్థావరం అమృత్‌సర్‌కు 320 కిలోమీటర్లు, ఛండీగఢ్‌కు 520 కిలోమీటర్లు, న్యూదిల్లీకి 720కిలోమీటర్ల దూరం లో ఉంది. ప్రస్తుతం నిఘావర్గాలు గుర్తించిన ప్రాంతలో రెండు సొరంగ మార్గాలు, మూడంచెల్లో కంచె, ఒక కార్యాలయం, మిషినికల్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ, గారేజీలు, నివాస సముదాయాలు ఉన్నాయి. శత్రువుపై తొలిసారి దాడిచేసే సామర్థ్యాన్ని పాక్ బలోపేతం చేసుకోని ప్రతి దాడికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. పాక్ రహస్యంగా అణ్వా యిధాలను భద్రపర్చే స్థావరాలు నిర్మిం చడం ఇదే తొలిసారి కాదు. భారత్ దాడి నుంచి రక్షించుకోవడానికి ఇప్పటికే పలు స్థావరాలు నిర్మించింది. గూగుల్ ఎర్త్‌లో పలు చోట్ల పాక్ న్యూక్లియర్ స్థావరాల కోసం తవ్విన సొరంగాలను భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

Comments

comments