Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

టీమిండియా టాప్ ర్యాంక్ పదిలం

team-indiaదుబాయ్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఐసిసి గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 123 పాయింట్లతో మొదటి ర్యాంక్‌ను కాపాడుకుంది. కిందటికంటే ఈసారి భారత్ ఒక పాయింట్‌ను అధి కంగా సాధించింది. ఈ సీజన్‌లో భారత్ వరుస విజయాలతో పలు సిరీస్‌లు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో టెస్టు క్రికెట్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో టీమిండి యా రెండో స్థానంలో నిలిచిన సౌతా ఫ్రికా (117) కంటే ఆరు పా యింట్ల ఆధిక్యంలో నిలిచింది. తాజా ర్యాంకిం గ్స్‌లో దక్షిణాఫ్రికా తన పా యింట్ల సంఖ్యను 109 నుంచి ఏకంగా 117కు మెరుగుపరుచు కుంది. అయినా భారత్ నుంచి టాప్ ర్యాంక్‌ను అందుకోవాలం టే ఇప్పట్లో సాధ్యమయ్యేలా లే దు. మరోవైపు ఆస్ట్రేలియా 100 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల భారత్ చేతిలో ఓటమి పాలుకా వడంతో ఆస్ట్రేలియా చాలా పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారత్, సౌతాఫ్రికా కంటే ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్లలో చాలా వెనుకబడి ఉంది. రెండు పాయింట్లు కోల్పోయిన ఇంగ్లండ్(99) నాలుగో స్థానానికి పరి మితమైంది. న్యూజిలాండ్ ఐదో, పాకిస్థాన్ ఆరో ర్యాంక్‌లో నిలి చాయి. శ్రీలంక 91 పాయింట్లతో ఏడో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్ 8వ, బంగ్లాదేశ్ తొమ్మిదో, జింబాబ్వే పదో స్థానాలను దక్కించుకున్నాయి.

Comments

comments