Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

నేషనల్ జాగ్రఫిక్ బీ విజేత మనోడే

NGBవాషింగ్టన్: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక 50 వేల డాలర్ల నేషనల్ జాగ్రఫిక్ బీ పోటీలో భారత సంతతికి చెందిన ప్రణయ్ వరదా(14) గెలుపొందాడు. దశాబ్ద కాలంగా ఈ పోటీలో భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులే ఆది పత్యం చెలాయిస్తున్నారు. గతసారి రన్నరప్‌గా నిలిచిన ప్రణయ్ ఈసారి ఏ మాత్రం పట్టు వదలక  విజేతగా నిలిచాడు. ఈ గెలుపు తనకు సంతృప్తి నిచ్చిందన్నాడు. మొదటి టై బ్రేకర్ ప్రశ్నలో అతడు తక్లిమకన్ ఎడారి, టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్న 1200 మైళ్ల విస్తీర్ణం ఉన్న కున్లున్ పర్వతాలను గుర్తిం చి విజేతగా నిలిచాడు. ఈ గెలుపుతో అతడికి 50,000 డాలర్ల ఉపకారవేతనం, ఇతర బహుమతులు సొంతమయ్యాయి. ఈ పోటీలో న్యూజెర్సీకి చెందిన మరో భారతీయ సంతతి విద్యార్థి వేదా భట్టారామ్ మూడో స్థానంలో నిలిచాడు. కాగా విస్కాన్సిన్‌కు  చెందిన థామస్ రైట్ రన్నరప్‌గా నిలిచాడు. రైట్‌కు 25,000 డాలర్లు, భట్టారామ్‌కు 10,000 డాలర్ల స్కాలర్‌షిప్ దక్కాయి. ఈసారి పోటీలో 10 మంది ఫైనలి స్టులలో ఆరుగురు భారత సంతతి విద్యార్థులే ఉండడం గమ నార్హం. గత ఆరు సంవత్సరాలుగా నేషనల్ జాగ్రఫిక్ బీ పోటీలో అమెరికాలోని భారతీయ  సంతతి విద్యార్థులే గెలుపొందుతూ వస్తున్నారు. గత ఏడాది  ఫ్లోరిడాలో ఆరో గ్రేడ్ చదువుతున్న రిషీ నాయర్ విజేతగా నిలిచారు.

Comments

comments