Search
Friday 26 May 2017
  • :
  • :
Latest News

ప్రశాంతంగా ప్రతీకారం తీర్చుకుంటా

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్‌హిట్ చిత్రాలతో మెప్పించిన యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం ‘కేశవ’. సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో ఇంటర్వూ విశేషాలు…

nikil* ఆద్యంతం ఎమోషన్…
బాలీవుడ్‌లో వచ్చిన ‘బదలాపూర్’ స్టైల్లో తెరకెక్కిన చిత్రం ‘కేశవ’. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం కాస్త రెట్రో స్టైల్లో ఉంటుంది. యాక్షన్ కన్నా ఎ మోషన్ ఎక్కువగా ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి చివరకు ఎమోషన్ కొనసాగుతుంది.

* ఆసక్తిని రేకెత్తిస్తుంది…
రివెంజ్ డ్రామాలో విలన్‌లపై హీరో ప్రతీకారం తీర్చుకోవడమనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోకు గుండె సమస్య ఉంటుంది. ఆ సమస్యను అధిగమించి ఎలా ప్రతీకారం తీర్చు కున్నాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

* ఆ పాయింట్ కారణంగానే…
ప్రశాంతంగా ప్రతీకారం తీర్చుకోవాలనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. హీరో పగతో రగిలిపో తుంటాడు. ఆ కోపాని బయటపెడితే గుండె సమస్య వల్ల అతను చనిపోతాడు. కానీ బ్రెయిన్ కూల్ అని అంటుంది. ఆ పాయింట్ కారణంగా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. సినిమా లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి…. చాలా ట్విస్టు లుంటాయి.

* లక్కీగా సుధీర్ దొరికాడు…
ప్రతి నటుడికి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చే యాలని ఉంటుంది. ఇప్పటివరకు నేను లవర్‌బా య్‌గా, కాలేజీ స్టూడెంట్‌గానే కనిపించాను. నాలో డిఫరెంట్ కోణాన్ని చూపించడానికి లక్కీగా నాకు సుధీర్ దొరికాడు. తను ఈ కథతో వచ్చినప్పుడు నచ్చి వెంటనే సిని మా చేయాలనిపించింది.

*కార్తికేయ-2 చేస్తా…
చందు మొండేటి దర్శక త్వంలో ‘కార్తికేయ-2’ చేస్తాను. కార్తికేయ సినిమా ఎక్కడ ఆగిపోయిందో అక్క డి నుంచి ఈ సినిమా ప్రా రంభమవుతుంది. స్వాతితో పాటు మరో హీరోయిన్ కూ డా ఇందులో నటిస్తుంది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమా ప్రారంభమవుతుంది.

* 600కు పైగా థియేటర్లలో…
పెద్ద నోట్ల రద్దు సమయంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విడుదలై పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు ‘బాహుబలి-2’ తర్వాత మా ‘కేశవ’ రిలీ జవుతోంది. మా చిత్రం 600 పైగా థియేటర్లలో విడుదలవుతుంది. ఓవర్సీస్‌లో యుఎఇ, ఆస్ట్రేలి యా సహా పలు దేశాల్లో సినిమా రిలీజ్‌కానుంది.

* తదుపరి చిత్రాలు…
నా నెక్స్ మూవీ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుం ది. ఆతర్వాత ‘కార్తికేయ-2’ సినిమా చేస్తా. అనం తరం ఓ మాస్ స్టయిల్‌లో మూవీ ఉంటుంది.

Comments

comments