రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ఇటీవల పూర్తి చేశారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరో రామ్‌చరణ్ తన పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొని నటిస్తున్నాడు. హైదరాబాద్‌తో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నాలుగు రోజుల షూటింగ్ చేసిన తర్వాత రాజమండ్రిలో 45 నుండి 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని సినిమా షూటింగ్‌ను నిర్మాతలు వాయిదావేశారు. ఇప్పుడు చిత్ర యూనిట్ జూన్ 1 నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోదావరి ఒడ్డున భారీ సెట్ వేసి అందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. అలాగే హైదరాబాద్‌లో సెట్ వేసి చిత్రీకరణ చేస్తారు. యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని ఆగస్టులో ప్రకటిస్తారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, ఆది తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గోదావరి ఒడ్డున ఇంట్రడక్షన్ సాంగ్
May 19, 2017
Previous Postకేన్స్‌లో మెరిసిన దీపిక ...హొయలొలికించిన మల్లికా
Next Postప్రశాంతంగా ప్రతీకారం తీర్చుకుంటా