Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

జార్ఖండ్ లో ఆటవిక రాజ్యం..

jarkhand-violence

వేర్వేరు ప్రాంతాల్లో ఆరు గురిని కొట్టి చంపిన స్థానికులు

పోలీసులపై రాళ్ల దాడి… రెండు పోలీసు వాహనాల ధ్వంసం

జెంషెడ్పూర్: ఆధునిక యుగంలోనూ ఆటవిక న్యాయం రాజ్యమేలుతుందనడానికి నిదర్శనం జార్ఖండ్ లో వెలుగు చూసిన సంఘటనే నిదర్శనం.
శిశువులను దొంగిలిస్తున్నారనే అనుమానంతో రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో గ్రామస్థులు ఆరుగురు వ్యక్తులను కొట్టి చంపారు. ఈ విషయాన్ని పిటిఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
వివరాల్లోకెళితే సోసోమోలి అనే గ్రామంలో పిల్లను ఎత్తుకెళ్లే గ్యాంగ్ అని అనుమానించి ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపినట్లు కొల్హాన్ ప్రాంతం డిఐజి ప్రభాత్ కుమార్ మీడియాకు వివరించారు. మరో సంఘటన అదే ప్రాంతంలోని శోభాపూర్ గ్రామంలోనూ మరో వ్యక్తిని కొట్టి చంపేసినట్లు డిఐజి తెలిపారు.
మూడో సంఘటన రాష్ట్రంలోని నగధి అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు ముగ్గురు వ్యక్తులను బలవంతంగా ఉరితీసి చంపినట్లు నగధి సిటీ పోలీస్ సూపరింటెండెంట్ ప్రశాంత్ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సందర్భంగా గ్రామస్థులు పోలీసులై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ హింసాకాండలో రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.

మొదటి సంఘటనలో హింసకు పాల్పడిన గ్రామస్థుల్లో ఇద్దరిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఉద్రిక్తత సద్దుమణిగిన అనంతరం వారిని అరెస్టు చేస్తామని డిఐజి ప్రభాత్ కుమార్ తెలిపారు.

        వారం రోజుల క్రితం జరిగిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పు సింఘ్భం జిల్లాలోని జాదుగొరాలోని యురేనియం టౌన్ షిప్ లో పిల్లలను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొందరు వ్యక్తులను స్థానికులు పట్టుకున్ని బంధించించి దాడి చేశారు. ఈ సంఘటనలో పలువురికి తీవ్రగాయాలవ్వగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

అయితే ఈ సంఘనను పోలీసుల బృందం అదుపులోకి తీసుకొచ్చే యత్నం చేస్తుంది. గ్రామస్థులు అనవసరంగా పుకార్లను నమ్మొద్దని పోలీసులు ప్రజలను కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

(వీడియో NDTV సౌజన్యంతో)

Comments

comments