Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

పోలీసులతో కెసిఆర్ భేటీ

CM-KCR-WGL

హైదరాబాద్ : తెలంగాణ సిఎం కెసిఆర్ శుక్రవారం పోలీసులతో భేటీ అయ్యారు. శాంతిభద్రతలు, పోలీసు శాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. ఎస్‌ఐ నుంచి డిసిపి స్థాయి అధికారులు సుమారు 1500 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు నెరపాలని కెసిఆర్ సూచించారు. పోలీసులు తమ పని తీరును, ప్రజల పట్ల తమ ప్రవర్తనను మెరుగుపర్చుకోవాలని ఆయన తెలిపారు.

రాష్ట్ర సాధనలో పోలీసుల సహకారం ఎంతో ఉందని అభినందించారు. లక్ష్యాలను చేరుకున్నప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, పోలీసుల పనితీరు మరింత మెరుగుపడాలని సూచించారు. పోలీసు శాఖ‌కు 500 కోట్ల బ‌హూమానం ఇస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త వాహ‌నాలు, మౌళిక స‌దుపాయాల కోసం ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేయాల‌న్నారు. హైద‌రాబాద్ పోలీసుకు అద్భుత‌మైన పేరు వ‌చ్చింద‌న్నారు. చాలా గొప్ప రిజ‌ల్ట్స్ తీసుకు వ‌చ్చిన‌ట్లు మెచ్చుకున్నారు. నగరంలో షీ టీమ్స్‌ పనితీరు కూడా అద్భుతంగా ఉందని, సింగపూర్‌ స్ఫూర్తితోనే షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.  పోలీస్ ప్ర‌మోష‌న్ల‌లో పైర‌వీల‌కు తావుండొద్ద‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. పోలీసుశాఖ‌లో ప‌నిచేసే ప్ర‌తి ఉద్యోగికి వారికి న్యాయంగా రావ‌లిసిన ప్ర‌మోష‌న్‌ను స‌మ‌యానికి ఇవ్వాల‌ని ఆదేశించారు. ఇందులో ఎలాంటి వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు, పైర‌వీల‌కు తావివ్వొద్ద‌న్నారు.

Comments

comments