Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

తన జీవితంపై పుస్తకం రాసేస్తోంది!

Manisha-Koiralaఇప్పుడు చాలామంది సీనియర్ నటులు పుస్తకాలు రాసేస్తున్నారు. తమ జీవితాలను పుస్తక రూపంలో మలచి అభిమానులకు కొత్త అనుభవాన్ని పంచుతున్నారు. వీరి జీవితంలో జరిగిన ఎన్నో తెలియని సంఘటనలు, వాటి వెనుక ఉన్న కారణాలు తెలుసుకునే అవకాశం ఈ పుస్తకాలతో కలుగుతోంది. బాంబే, భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి దక్షిణాది చిత్రాల్లో నటించిన బాలీవుడ్ భామ మనీషా కొయిరాలా కూడా ఓ పుస్తకం రాస్తోంది. తన జీవితం గురించే రాస్తున్నా ఈ పుస్తకం ఆటోబయోగ్రఫీ మాత్రం కాదంటోంది మనీషా. ఏడాదిగా ఆమె ఓ ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్‌తో చర్చలు జరుపుతూ పుస్తకాన్ని రాసేస్తోంది. “నాకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఇక నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని అందరికీ పంచుదామన్నదే నా ఆలోచన. నేను రాస్తున్నది నా ఆటోబయోగ్రఫీ కాదు. అయితే ఇందులో నా జీవితం, సినీ జీవితం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రం ఉంటాయి. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు… చాలా విషయాలు రాశాను. అవే ఇప్పుడు నా పుస్తకానికి మూలం”అని అంటోంది మనీషా కోయిరాలా. ఈ భామ గతంలో క్యాన్సర్‌తో బాధపడి… ఆ మహమ్మారి నుంచి బయటపడ్డ సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో మనీషా  చేసిన పోరాటమే ఆమె రాస్తున్న పుస్తకానికి మెయిన్ థీమ్. ప్రస్తుతం ‘సంజయ్‌దత్’ మూవీలో నర్గీస్ పాత్రలో మనీషా నటిస్తుండగా… త్వరలో డియర్ మాయ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సీనియర్ బ్యూటీ.

Comments

comments