Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

30న మెడికల్‌షాపుల బంద్

Medical-Shop

హైదరాబాద్:  ఔషధాల క్రమ విక్రయాలు ఈ పోర్టల్ విధానంలో జరగాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, ఆన్‌లైన్ విక్రయాలను ఆపాలంటూ ఈ నెల 30న దేశ వ్యాప్తంగా మెడికల్‌షాపుల యజమానుల సంఘం బంద్ పాటించాలని నిర్ణయించింది. ఈ బంద్‌లో రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కూడా పాల్గొననున్నట్లు వెల్లడించింది.

వైద్యుల ప్రిస్కిప్షన్, ఔషధాల అమ్మకానికి సంబంధించిన బిల్లును ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధన ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని అసోసియేషన్ తెలిపింది. అంతేగాక సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు అత్యవసర మందులను విక్రయించలేమని, దీంతో రోగులకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.

Comments

comments