శ్రీనగర్ : వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. కశ్మీర్లో పరిస్థితిని మెరుగుపర్చేందుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీనగర్‌లో జరుగుతున్న జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌లో కూడా వేర్పాటువాదులతో చర్చలు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. జమ్ము కశ్మీర్ ప్రజలు వేర్పాటువాదులకు సహకరించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.