Search
Friday 26 May 2017
  • :
  • :
Latest News

మార్కెట్లోకి నోకియా 3310

nokia-3310న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న నోకియా ఫోన్ 3310 గురువారం మార్కెట్లోకి వచ్చేసింది. దేశం లోని అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ అందుబా టులోకి తీసుకువ చ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్ కాం గ్రెస్ 2017లో దీ న్ని హెచ్‌ఎండీ గ్లోబల్ విడుదల చేసింది.అనంతరం మే 16న భారత్ లోకి అధికారికంగా లాంచ్ చేసింది. 2జీ మొబైల్ డేటా నెట్ వర్క్ ను మాత్రమే ఈ ఫోన్ సపోర్టు చేస్తోంది. వై-ఫైను ఇది సపోర్టు చేయదు. బ్యాటరీ కెపాసిటీ 1200 ఎంఎహెచ్‌తో నోకియా 3310 పేరిట ఈ ఫోన్ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర కూడా రూ.3310 అని నోకియా ప్రతినిధులు తెలిపారు. ఎరుపు, పసుపు, నీలం, వూదా రంగుల్లో ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్లను విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. ఓ దశలో మొబైల్ మార్కెట్‌ను శాసించిన నోకియా ఆ తర్వాత ఆండ్రాయిడ్ దెబ్బకు చతికిలపడింది. ఆ బ్రాండ్ పేరును ఇటీవల హెచ్‌ఎండీ గ్లోబల్ సొంతం చేసుకుని, సరికొత్త ఫోన్లను ఆవిష్కరిం చింది. ఆండ్రాయిడ్‌కు దీటుగా ఫీచర్లను జోడిస్తూ మొబైల్ మోడళ్లను తీసుకొచ్చింది. పాత 3310 మోడల్‌కు సరికొత్త ఫీచర్లు కల్పిం చి ఈ ఫోన్‌ను రూపొందించింది. దీంతో పాటు నోకియా 6, నోకియా 5, నోకియా 3 మోడళ్లను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురా నుంది. నోకియా 3310 ఫీచర్లు ఇలా ఉన్నా యి. 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 1200 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 2.40 అంగుళా ల తెర, నోకియా సిరీస్ 30 ఆపరేటింగ్ సిస్టమ్, 16 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మెమొరీ కార్డుతో 32జిబి వరకు పెంచుకునే సదుపాయం ఉన్నాయి.

Comments

comments