Search
Friday 20 April 2018
  • :
  • :

జాదవ్ ఉరిపై స్టే

అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్‌కు ఎదురుదెబ్బ

  ఇస్లామాబాద్ చర్య వియన్నా ఒప్పందానికి విరుద్ధం  

జాదవ్‌ను కలుసుకోడానికి భారత్‌కు అవకాశం ఇవ్వాలని ఐసిజె ఆదేశం  

మన వాదనకు ఘన విజయం  

అంగీకరించేది లేదు : పాక్ 

javedహేగ్: పాకిస్థాన్ చెరలో చావుబతుకుల మధ్య ఉన్న భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై అంత ర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) గురువారం స్టే మం జూరు చేసింది. తమ తుదితీర్పు వెలువడేవరకూ ఆయన ఉరిశిక్షను అమలు చేయరాదని ఐసిజె పాకి స్థాన్‌ను ఆదేశించింది. అయితే తీర్పుపై స్పందించిన పాకిస్థాన్ తాము దీనిని ఆమోదించేది లేదని, జాదవ్ కు ఉరి అంశం తమ దేశ జాతీయ భద్రతకు సంబం ధించిన అంశమని స్పష్టం చేసింది. భారత నౌకాదళా మాజీ అధికారి అయిన జాదవ్‌ను పాకిస్థాన్ గూఢచార్యం అభియోగాలపై అదుపులోకి తీసుకుం ది. తరువాత సైనిక న్యాయస్థానం విచారణ నిర్వహిం చి ఆయనకు మరణశిక్షను విధించింది. ఉరికి చేరువ లో ఉన్న జాదవ్‌కు కొండంత ఊరటగా, పాకిస్థాన్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బగా, భారతదేశానికి ఓదార్పుగా ఈ అంతర్జాతీయ న్యాయస్థానం రూలింగ్ వెలువడిం ది. ఐసిజె ప్రెసిడెంట్ జస్టిస్ రోనీ అబ్రహం ఆధ్వర్యం లోని 11 మంది సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. జాదవ్ భారతదేశం తరఫున వేగు చర్యలకు పాల్పడ్డారని, విద్రోహ చర్యలకు దిగా రని పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం వెలువరించిన తీర్పును భారతదేశం పలు వేదికల నుంచి సవాలు చే స్తూ వస్తోంది. తాము వెలువరించిన స్టేను కచ్చితంగా అమలు చేయాలని, దీనిని ఉల్లంఘించరాదని పేర్కొ న్న అంతర్జాతీయ న్యాయస్థానం ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం తమకు తగు వివరణ ఇచ్చుకోవల్సి ఉంద ని కూడా ఆదేశించింది. తీర్పు పాఠంలో న్యాయ స్థానం పాకిస్థాన్‌ను మందలించింది. ఈ ఉరిశిక్ష అంశం అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ పరిధి లోకి వచ్చి తీరుతుందని, దీనిని ఆక్షేపించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ‘విచా రణ ప్రక్రియ ముగిసి తమ తుది తీర్పు వెలువడే వరకూ జాదవ్‌ను ఉరితీయరాదు. ఈ మేరకు మేం వెలు వరి స్తున్న ఆదేశాలను అమలు చేసే చర్యలను పాకిస్థాన్ చేప ట్టాల్సి ఉంది’ అని ఐసిజె ప్రెసిడెంట్ తీర్పు పాఠం చదివి విన్పించారు. తుది తీర్పు వెలువరే వరకూ జాదవ్ ఉరి శిక్షకు సంబంధించిన అంశాలన్నీ న్యాయ స్థానం పరిధి లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి కి చెందిన అత్యున్నత న్యాయస్థానం వెలువరిం చిన తీర్పు జాదవ్ అంశంలో భారతదేశం సాగిస్తోన్న ప్రపంచ స్థా యి దౌత్య యత్నాలకు విజయంగా భావిస్తు న్నారు. ఖైదీ గా ఉన్న జాదవ్‌ను కలుసుకునేందుకు భారత రాయ బారికి అవకాశం కల్పించాలని కూడా పాకిస్థాన్ ఉన్నతా ధికారులకు న్యాయస్థానం ఆదేశాలు వెలువరించింది.
వియన్నా ఒప్పంద ఉల్లంఘన
జాదవ్ కేసులో పాకిస్థాన్ దౌత్య సంబంధిత వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కూడా ఐసిజె నిర్థారించింది. ఈ మేరకు భారతదేశం చేసిన వాదన సరైనదే అని పేర్కొంది. 1977లో భారత్, పాకిస్థాన్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. తమ దేశీయుడికి శిక్ష పడితే దౌత్యవేత్తలు కలుసుకునేందుకు పాకిస్థాన్ అనుమతి నిరాకరించిందని భారతదేశం చేసిన వాదన సహేతుకంగా ఉందని అంతర్జాతీయ న్యాయ ధర్మాసనం పేర్కొంది. జాదవ్ కేసులో భారతదేశం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేతో కూడిన న్యాయవాదుల బృందం వాదనలు విన్పించింది. హరీశ్ సాల్వే ఈ కేసులో నామమాత్రంగా ఒక్క రూపాయి ఫీజు తీసుకున్నారు. పాకిస్థాన్ తరఫున న్యాయవాది అస్తర్ అలీ బృందం రంగంలోకి దిగింది.
ప్రధాని మోడీ సంతృప్తి .. సుష్మా స్పందన
అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పట్ల ప్రధాని మోడీ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడా రు. భారత్ బలీయ వాదన విన్పించేలా చేసినందుకు అభి నందించారు. ఈ తీర్పు గొప్ప ఓదార్పు అని సుష్మా స్వ రాజ్ వ్యాఖ్యానించారు. సాల్వేకు ఆయన బృందానికి ప్ర ధాని మోడీ, సుష్మా స్వరాజ్‌లు అభినం దనలు తెలిపా రు. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లోని అంతర్జా తీయ న్యాయ స్థాన వేదికపై గత మూడు రోజులుగా భారత్, పాకిస్థా న్‌లు జాదవ్ ఉరి ముడిపై తమతమ వాదనలు విన్పిస్తూ వస్తున్నాయి. జాదవ్‌పై పాకిస్థాన్ సైనిక అధికారులు జరి పిన విచారణ బూటకం అని, ఓ ప్రహసంగా ఉందని, ఇందులో నిందితుడి వాదనలకు తావులేకుండా చేశార ని, సైనిక న్యాయస్థానం గుడ్డిగా ఏకపక్ష తీర్పు వెలువ రించిందని భారతదేశం తరఫు న్యా యవాదులు తమ వాదన విన్పించారు. జాదవ్‌కు మరణ శిక్షను సవాలు చే స్తూ భారతదేశం ఈ నెల ఎనిమిదవ తేదీన హేగ్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. మరుసటి రోజే కోర్టు వారు ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ విచారణల ప్రక్రియను చేపట్టింది.
కాంగ్రెస్ హర్షం.. లాయర్లకు అభినందన
జాదవ్‌కు ఊరట కల్పిస్తూ వెలువడ్డ తీర్పుపై కాం గ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హర్షం వ్యక్తం చేశా రు. జాదవ్‌కు పూర్తి స్థాయిలో న్యాయం జరిగి, ఆయన భారతదేశానికి సురక్షితంగా వచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐసిజె సముచి తంగా స్పందించిం దని పాకిస్థాన్ వితండవాదాన్ని పూర్తి స్థాయిలో తోసిపు చ్చిందని , అంతర్జాతీయ చట్టాలను కాలరాసిన పాకిస్థా న్‌కు గట్టిగా మొట్టికాయలు వేసిందని తెలిపారు. భారతీ య న్యాయవాదుల బృందాన్ని అభినందించారు.

Comments

comments