Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

పెంచిన మెడికల్ పిజి ఫీజులు చెల్లించాలి

సగం నగదుగా, మిగతాది బాండ్ల రూపంలో : హైకోర్టు 

high-courtహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల లోని మైనారిటీ, ప్రైవేటు మెడికల్ కాలేజీ పిజి విద్యలో ఫీజు పెంపుపై హైకోర్టు గతంలోని స్టే ఉత్తర్వులను సవరించింది. మైనారిటీ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఊరటనిస్తూ గత ఉత్తర్వుల ను గురువారం హైకోర్టు సవరించింది. తెలంగాణ రాష్ట్రంలో పిజి మెడికల్ విద్య ఫీజు పెంచుతూ ఈ నెల 9న జారీ చేసిన జిఒ 41 అమలును నిలిపి వేస్తూ గతంలో హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వును హైకోర్టు సవరించింది. పెంచిన మెడికల్ ఫీజులో సగం చెల్లించాలని, మిగిలిన సగం మొత్తానికి బాండ్ల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేయాలని న్యాయమూర్తులు ఎ.వెంకట శేషసా యి, ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. మెడికల్, డెంటల్ సీట్ల భర్తీ నిబంధ నలను సవరిస్తూ మరో జిఒ 40ను కూడా ప్రభు త్వం జారీ చేసింది. ఈ రెండు జిఒలను ఉస్మా నియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, హెల్త్ కేర్ రీఫారమ్స్ డాక్టర్స్ అసోసియేషన్లు హైకోర్టులో సవాల్ చేశాయి. వీటిని విచారించిన హైకోర్టు గతంలో జిఒ 41 అమలుపై స్టే విధించింది. ఇదిలా ఉండగా ఎపి సర్కార్ కూడా వైద్య విద్య ఫీజులను పెంచుతూ ఈ నెల 3న జిఒ 70/72 జారీ చేసింది. వీటిని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గోవింద కుముద సుష్మ, ఎపి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్లు వేరువేరుగా హైకోర్టులో సవాల్ చేశాయి. తెలంగాణ సర్కార్ జిఒ 41పై ఉన్న స్టే ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్య అనుబంధ పిటిషన్లు వేశాయి. ఈ మొత్తం కేసులను విచారించిన హైకోర్టు గతంలోని స్టే ఉత్తర్వులను సవరిస్తూ పైవిధంగా మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఫీజు నియంత్రణ కమిటీ సిఫార్సు లేకుండానే రెండు రాష్ట్రాలు భారీగా ఫీజు పెంచాయని జూ.డా.సంఘం తరఫు న్యాయవాది రవిచందర్ వాదించారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ కాలేజీలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని, అయినా యాజమాన్యాలతో చర్చించాకే ఫీజులను పెంచామని తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదించారు. గత స్టే ఉత్తర్వుల కారణంగా కాలేజీ విద్యార్థులను చేర్చుకోవడం లేదన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ఎందుకు చేర్చుకోవడం లేదని తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్య సంఘం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. స్టే వల్ల కొంత మేరకు గందరగోళం ఉన్నందున అడ్మిషన్లు జరపడం లేదని సంఘం తరఫు న్యాయవాది ప్రకాష్‌రెడ్డి బదులిచ్చారు. ఎపి జూడా తరఫు న్యాయవాది సివి మోహన్‌రెడ్డి వాదించారు. వాదన అనంతరం బెంచ్.. పెంచిన ఫీజులో సగం వసూలు చేయాలని. మిగిలిన సగాన్ని బాండ్ల రూపంలో తీసుకోవాలని ఆయా కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది. తుది తీర్పునకు లోబడి ఈ ఉత్వర్వు ఉంటాయని, విచారణ జూన్‌లో చేపడతామని బెంచ్ ప్రకటించింది.

Comments

comments