Search
Thursday 25 May 2017
  • :
  • :
Latest News

 సిఎం సార్ వెల్‌కం…

CM-KCR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నగరంలోని హెచ్‌ఐసిసిలో ఎస్‌ఐ స్థాయి అధికారి నుంచి డిజిపి స్థాయి పోలీసు అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలం ఒకటి సిఎం కెసిఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగత పలకగా, మిగతా జాగిలాలు సెల్యూట్ చేశాయి.

ఈ కార్యక్రమంలో కెసిఆర్ బాంబ్ స్కాడ్ పనితీరు, సెర్చ్ అండ్ డిటెన్షన్, ప్రొటెక్షన్ అండ్ డిస్పోజబుల్ పరికరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఉపయోగించే రకరకాల ఆయుధాలను, వాటి సామర్థాన్ని ముఖ్యమంత్రికి పోలీసు అధికారులు వివరించారు. అలాగే దొంగనోట్లు, డ్రగ్స్‌ను గుర్తించే కొత్త టెక్నాలజీ పరికరాలను సిఎం పరీక్షించారు. దీంతోపాటు షీ టీమ్స్ పని చేస్తున్న విధానాన్ని అధికారులు సిఎం కెసిఆర్‌కు వివరించారు.

Comments

comments