Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

ముఖేశ్ అంబానీకి అగ్రస్థానం

 ఫోర్బ్ ‘గ్లోబల్ గేమ్ చేంజర్స్’ జాబితా

anilambaniన్యూయార్క్: ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్ గ్లోబల్ గేమ్ చేంజర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. అంతర్జాతీయంగా కోట్లా ది మంది జీవితాల్లో మార్పులు తీసుకురావడం, పరిశ్రమల్లో మార్పులు చేసేవారిని గ్లోబల్ గేమ్ చేంజర్‌గా భావిస్తారు. దీనికి గాను ఈ జాబితాలో ముఖేష్ తొలి స్థానంలో ఉండడం గొప్ప విషయం.. తాజాగా ఫోర్బ్ 25 మంది వ్యాపార వేత్తలతో కూడిన రెండో వార్షిక గ్లోబ ల్ చేంజర్ జాబితాను ప్రకటించింది. భారత్‌లో టెలికామ్ రంగంలోకి ప్రవేశించి పెను మార్పులకు శ్రీకాలం చుట్టిన 60 ఏళ్ల ముఖేష్ ఈ జాబితాలో మొదటి ర్యాంక్‌ను పొందారు. దేశంలో అత్యధిక మొత్తంలో ప్రజలకు ఇంట ర్నెట్ సదుపాయాన్ని అందించడంలో ఆయన గేమ్ ఛేజిం గ్ సత్తాను ఫోర్బ్ ప్రశంసించింది. ఆయిల్ నుంచి గ్యాస్ వరకు అన్ని రకాల వ్యాపారాల్లో హవా చాటుతున్న రిల యన్స్ ఇండస్ట్రీస్.. టెలికాం మార్కెట్లోకి ప్రవేశించి సంచల zనం సృష్టించింది. ఉచిత ఆఫర్లు, అత్యంత చవకైన ధరలతో చాలా వేగవంతమైన ఇంటర్నెట్ ను ఆఫర్ చేసింది. ఆరు నెలల కాలంలోనే 100 మిలియన్ కస్టమర్ల మార్కును పొందిందని రిలయన్స్ జియోను ఉద్దేశించి ఫోర్బ్ కొనియాడింది. ఏదైనా, ప్రతీది డిజిటల్‌కు వెళ్లాల్సింది డిజిటల్ వెళ్లాలి. భారత్ వెనుబడొద్దు అని ముఖేష్ అంబానీ అన్న సూక్తిని ఈ సందర్భంగో పోర్భ్ గుర్తుచేసింది. ఈ జాబితాలో హోమ్ అప్లియన్స్ డైసన్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ డైసన్, అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ బ్లాక్ రాక్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పింక్, సౌదీ అరేబియా డిప్యూటీ క్రౌన్ మహమ్మద్ బిన్ సల్మాన్, స్నాప్ సహ వ్యవస్థాపకుడు ఇవాన్ స్పీగల్, చైనీస్ రైడ్ షేరింగ్ దిగ్గజం దిది చుక్సింగ్ వ్యవస్థాపకుడు చోటు దక్కించుకున్నారు.
7 బిలియన్ డాలర్లు పెరిగిన ముఖేష్ సంపద
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో ఘనతను సాధించారు. 2017 జనవరి నుంచి ఐదు నెల ల్లో ఆయన సంపద 7 బిలియన్ డాలర్లు పెరిగినట్టు ఎకన మిక్ టైమ్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు గత ఏప్రిల్ నెలలో ముఖేష్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ టా టా గ్రూప్‌కు చెందిన టిసిఎస్‌ను వెనక్కినెట్టి అత్యంత వి లువైన కంపెనీగా స్థానం దక్కించుకుంది. 2017 మే 17 నాటికి అంబానీ సంపద 7.10 బిలియన్ డాలర్లు పెరిగి 29.9 బిలియన్లకు చేరింది. దేశీయ వ్యాపార దిగ్గజాల్లో అత్యంత త్వరగా సంపదను పెంచుకున్న ఘటన ముఖేష్ కే దక్కడం విశేషం. ఆయన ప్రారంభించిన టెలికామ్ సం స్థ రిలయన్స్ జియోకు మంచి స్పందన రావడం, త్రైమాసికం- త్రైమాసికం ఆధారంగా చూస్తే వ్యాపార వృద్ధి రిలయన్స్ సంస్థకు సానుకూలంగా మారాయి

Comments

comments