Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

రజనీపై స్వామి సంచలన వ్యాఖ్యలు

SUBBU

ఢిల్లీ : సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాలకు సరిపోరని, ఆయన తమిళనాడు సిఎంగా పనికి రారని స్వామి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రజనీకి భవిష్యత్ లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో ఎంతో మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని, వారు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. అందుకే రజనీ సిఎం పదవికి సరిపోరన్నారు. స్వామి వ్యాఖ్యలు రజనీ అభిమానులకు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరి రోజైన శుక్రవారం రజనీ అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాలపై ఆయన పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యుద్ధం ప్రారంభమయ్యేప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తానంటూ అభిమానులకు ఆయన సందేశం ఇచ్చారు. తమిళనాడులో డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, అన్బుమణి రాందాస్ వంటి మంచినాయకులు ఉన్నప్పటికీ, వ్యవస్థే సరిగా లేదని ఆయన అన్నారు. ఈ క్రమంలో త్వరలోనే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Comments

comments