Search
Tuesday 19 June 2018
  • :
  • :

ప్రశ్న పుట్టింది ఉద్యమంలోనే

దానిని కాలరాయడం అధికారాన్ని బలవంతంగా అనుభవించడమే: కోదండరామ్

Kodandaramసిద్దిపేట: తెలంగాణలో ప్రశ్నిం చొద్దనే దుష్ట సంప్రదాయం పెరుగుతుండటం అధికారాన్ని బలవంతంగా చలాయించడమేనని టిజెఎసి చైర్మన్ కోదండరాం చెప్పారు. గురు వారం సిద్దిపేటలో జరిగిన జిల్లా తెలంగాణ విద్యా వంతుల వేదిక ప్రథమ మహాసభలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య ఆలోచనలను ప్రభుత్వం గుర్తించక పోతే ధర్నాచౌక్ ఉదంతాలే ఉదాహరణగా నిలు స్తాయన్నారు. ప్రశ్నించే ధైర్యం తెలంగాణ ఉద్య మం ఇచ్చిందని, హైదరాబాద్‌లో సమస్యల కోసం ధర్నా చేయకపోతే బయట ఎక్కడ చేసినా అది అరణ్యరోదనే అవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో జరిగినట్టుగానే తెలంగాణాలో ఆంధ్ర కాంట్రా క్టర్ల జేబులు నింపుతుండటాన్ని చూసి ఎవరు ఊరుకోలేరన్నారు. వీటిని ప్రశ్నించడానికి ప్రత్యా మ్నాయ వేదికగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఎదగాలని ఆకాంక్షించారు. సమస్యలపై ప్రశ్నిస్తే అందరికి లాభమేకాని, ప్రభుత్వం మాత్రం ప్రశ్నించొద్దనే అభిప్రాయం వ్యక్తం చేస్తోందన్నా రు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనల ప్రకారం విద్యావంతులు మౌనంగా వుండటం వల్ల సమా జానికి హాని కలుగుతుందని ప్రజల అండదండ లతో కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం వుంద ని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఫలాలు అందరికి దక్కాలనేది జయశంకర్ భావన అని దాన్ని సాధ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.

వనరుల సాధనకు స్వాభిమానంతో పనిచేయాలని వ్యవసాయం నుంచి లాభసాటి ఆదాయం వచ్చేలా, చిన్నచిన్న కంపెనీల ఏర్పాటు ద్వారా తెలంగాణ బాగుపడటానికి దోహదపడు తుందన్నారు. రైతుల గురించి మంచి పాటలు రాయాలన్న సిఎంకు తెలంగాణ పాటలతో రైతు లు ఎంతో ఉత్తేజితులయ్యారో తెలుసని అదే స్ఫూ ర్తితో వారు ప్రశ్నిస్తారన్నారు. ప్రశ్నించే రైతులపై రాజద్రోహ నేరం మోపి సంకెళ్లు వేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్య లను వినాల్సింది  పోయి ప్రశ్నించడమే తప్పంటున్నారన్నారు. టిజెఎసి తెలంగాణ విద్యావంతుల వేదికకు ఎల్లవేళలా అండగా వుంటుందని భయపడుతూ బతకడానికి తెలంగాణ తెచ్చుకోలేదని స్పష్టం చేశారు. టివివి రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీంధర్ మాట్లాడుతూ గతంలో పాలించిన కాంగ్రెస్, టిడిపిల కంటే అవమానకరంగా టిఆర్‌ఎస్ పాలనసాగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాలన తెలంగాణకే తీరని మచ్చగా మారిందని అభివర్ణించారు. ధర్నాచౌక్ వద్దంటున్న వారి గురించి చెబుతున్న ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దంటున్న వారి గురించి ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు.

ప్రాంతీయ పార్టీల పాలన కుటుంబ పాలనగా మారుతోందని విమర్శించారు. ప్రభుత్వమే కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టివివి జిల్లా అధ్యక్షుడు పెద్ది రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టిజెఎసి జిల్లా చైర్మన్ బాబురావు, భూపతిరెడ్డి, కృష్ణదయాసాగర్, ఎల్లయ్య, జంగిటి శ్రీనివాస్,లక్షి, శంకర్‌లు మాట్లాడారు. అంతకు మునుపు తెలంగాణ అమరవీరులు, నీటిపారుదల నిపుణులు విద్యాసాగర్‌రావు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అభివృద్ధికి సంబంధించి 14 తీర్మానాలను ఆమోదించారు.

Comments

comments