Search
Tuesday 26 September 2017
  • :
  • :
Latest News

చిరు 151 మూవీ స్టోరీ లీక్..?

Uyyalawada-Narisimha-Reddy

ఖైదీ నంబర్.150 సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించుకున్నారు. ఈ చిత్రం ఘన విజయంతో చిరు తర్వాతి చిత్రంపై ఆయన అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితగాథపై చిరు 151వ చిత్రం చేస్తున్నారనే వార్త అభిమానుల్ని మరింత ఉర్రుతలూగిస్తుంది. అంతేకాక ఇప్పుడు అస్సలు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎవరు, ఆయన ఏం చేసేవారు అనే విషయంపై కూడా ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకొనేందుకు చిరు అభిమానులు తెగ ప్రయత్నిస్తున్నారు.

గూగుల్ లోనూ ఉయ్యాలవాడ గురించి వెతికితే చిరు ఫోటోలే రావడంతో తీవ్రంగా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చిరు హీరోగా చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథ ఇదేనంటూ ఓ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 1857 సిపాయిల తిరుగుబాటుకు కొద్ది సంవత్సరాల క్రితమే తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల పరిపాలనపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులపై తిరుబాటు ప్రకటించిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ. సైన్యంతో ఓ బ్రిటీష్‌ స్ధావరంపై దాడి చేసిన నరసింహారెడ్డి బ్రిటీష్‌ సైనికులను అక్కడి నుంచి తరిమికొట్టాడు. దీంతో ఉయ్యాలవాడను అణచివేయాలని అప్పటి బెంగాల్‌ గవర్నర్‌ మార్క్‌ హేస్టింగ్స్ మద్రాస్‌ కలెక్టర్‌ సర్‌ థామస్‌ మన్రోకు ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఉయ్యాలవాడను పట్టుకున్న బ్రిటీష్ అధికారులు ఆయన్ను బహిరంగా ఉరి తీశారు.

కాగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర. అయితే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రకి చిన్నపాటి మార్పులతో చేసిన కథ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే చరిత్రను ఉన్న విధంగానే సినిమాను చిత్రీకరిస్తారో.. లేక మార్పులతో కూడిన స్క్రిప్ట్ ని తీస్తారో.. వేచి చూడాల్సిందే.

Comments

comments