Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

క్షిపణి, అణ్వస్త్ర పరీక్షలు నిలిపేస్తేనే ఉత్తరకొరియాతో అమెరికా చర్చలు: హేలీ

Nikki-Haley--జెనీవా: అన్ని అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలను నిలిపేస్తేనే ఉత్తరకొరియాతో అమెరికా చర్చించే అంశాన్ని పరిశీలించగలదని అమెరికా రాయబారి నిక్కీ హేలీ విలేకరులకు చెప్పారు. ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించే విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహించడానికి ముందు ఆమె విలేకరులకు ఈ విషయం చెప్పారు. ఉత్తరకొరియాకు దౌత్య, సైనిక మిత్రదేశమైన చైనాతో కలసి అమెరికా కొత్త తీర్మానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తోందని ఆమె చెప్పారు. తామింత వరకు చేయనిదానిపై కృషి చేస్తున్నామన్నారు. ప్యోగ్యాంగ్‌పై ఆంక్షలు విధించాలనే తాము యోచిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరకొరియా ఆదివారం దీర్ఘ శ్రేణి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఇది ప్రపంచ మంతా కలవరపడడానికి కారణమైంది. భారీ అణ్వాయుధాన్ని మోసుకెళ్లగల సామర్థం ఈ ‘హ్వాసాంగ్-12’ క్షిపణికి ఉన్నట్లు ఉత్తరకొరియా చెప్పుకుంటోంది. ఈ క్షిపణి సాధారణంగా 2,111.5 కిమీ. ఎత్తుకు, 787 కిమీ. దూరానికి దూసుకెళ్లి జపాన్ సముద్రంలో పడింది. ఈ క్షిపణి పరీక్ష అది గరిష్ఠంగా 4,500 కిమీ. వరకు పోగలదని సూచించింది.

Comments

comments