Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

నెక్ట్స్ టార్గెట్ స్మార్ట్ ఫోన్లే..!

Wannacry

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ తలనొప్పిగా మారిన సమస్య ‘వన్నా క్రై రాన్సమ్ వేర్’ వైరస్. ఇప్పటికే చాలా దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లు.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఈ వైరస్ బారీనపడి సతమతమవుతున్నాయి. వివిధ రకాల సందేశాల ద్వారా హ్యాకర్లు ఈ వైరస్ ను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సైబర్ నిపుణులు దీనికి పరిష్కారం కొనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఏదో విధంగా వైరస్ వ్యాప్తి చేయడానికి అంతే గట్టిగా ప్రయత్నిస్తున్నారు హ్యాకర్లు.

ఇక వన్నా క్రై రాన్సమ్ వేర్ వైరస్ తన బాణాన్ని స్మార్ట్ ఫోన్ల వైపు ఎక్కుపెట్టినట్టు సమాచారం. ప్రపంచంలో ఎక్కువ శాతం యూజర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గల మొబైల్స్ ని వాడుతున్నారు. సో, వన్నా క్రై ఆండ్రాయిడ్ ని సెక్ట్స్ టార్గెట్ చేసుకుందని సైబర్ సెక్యూరిటి నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్లు రెండు దశలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. హ్యాకర్లు తర్వాతి టార్గెట్ స్మార్ట్ ఫోన్లే నిజమైతే, ప్రపంచానికి తీవ్ర ముప్పే వాటిల్లనుందని పేర్కొన్నారు.

Comments

comments