Search
Friday 26 May 2017
  • :
  • :
Latest News

బాహుబలి కొనసాగనుందా..!?

ఒక సినిమా.. రెండు భాగాలు.. ఐదు సంవత్సరాలు.. దాదాపు 2వేల మంది కష్టం ఇదంతా కలిస్తే ‘బాహుబలి’ సినిమా. బాహుబలి మొదటి భాగం విడుదలైన ఎంత ఘన విజయం సాధించిందో.. ఇప్పుడు రెండు పార్ట్ ది కంక్లూజన్ విడుదలై మొదటి భాగం రికార్డులను తిరగరాస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే హాలీవుడ్ చిత్రాల కలెక్షన్లను దాటేసి.. దాదాపు రూ.540 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది. సరే ఇక బాహుబలి క్రేజ్ గురించి మాట్లాడుకంటే.. మొదటి పార్ట్ రిలీజ్ నుంచి ఇప్పటి వరకు సినిమాపై ఎన్ని స్పూఫ్‌లు, ఎన్ని ఇమిటేషన్లు, ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే వెల్లువెత్తిన సందేహం దేశం మొత్తాన్ని కుదిపేసింది అనడంలో అశ్చర్యమేమి లేదు.

Baahubali-3

అయితే బాహుబలి ది కంక్లూజన్ వచ్చేసింది. దేశం మొత్తం ఎదురు చూసిన ప్రశ్నకు సమాధానం దొరికింది. హాలీవుడ్ సినిమాలను తలదన్నై విజువల్స్‌తో, మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు మరోసారి రుచి చూపించేలా బాహుబలి రెండో భాగాన్ని తెరకెక్కించాడు దర్శకధీరుడు రాజమౌళి. కాగా ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న వేళ.. మరో ప్రశ్న ప్రేక్షకుల మదిలో తలెత్తింది. బాహుబలి రెండో భాగంతో ముగిసిపోయిందా.. లేక మరో భాగం ఉంటుందా అని. అయితే రెండో భాగం సినిమా చూసిన కొంత మంది ఈ సినిమా అయిపోయింది… మరో భాగం వచ్చే అవకాశం లేదని అంటుంటే.. మరికొందరేమో.. మూడో పార్ట్ కూడా వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. కాగా తాజాగా జక్కన్న కూడా ఓ ఇంటర్యూలో బాహుబలి ఇక్కడితో అయిపోలేదు.. ఇంకా కొనసాగుతుందని చెప్పాడట.. అంటే మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తా అని ఆయన పరోక్షంగా చెప్పాడనే వాదని వినిపిస్తుండగా.. లేదు సినిమాలా కాకుండా.. కామిక్స్, నవలలు, కథలు ఇలా ఇతర మాద్యమాల్లో బాహుబలి కొనసాగుతుందని కొందరి అభిప్రాయం

మూడో పార్ట్ కోసమే రెండో పార్ట్‌లో కొన్ని రివీల్ చేయలేదా.. :

బాహుబలి ది కంక్లూజన్ చూసిన వాళ్లకి కొన్ని సందేహాలు కచ్చితంగా వచ్చే ఉంటాయి…

  1. భళ్లాలదేవుడిని మరణం తర్వాత అతని తండ్రి బిజ్జలదేవుడు ఏమయ్యాడు.?
  2. మహేంద్ర బాహుబలి, అవంతికి వివాహం.?
  3. బాహుబలి రాజుగా ఉంటే.. మాహిష్మతి రాజ్యానికి సర్వనైన్యాధక్షుడు ఎవరు.?

అయితే ఇవే కాకుండా మరికొన్ని విషయాలను కూడా రెండో పార్ట్‌లో రివీల్ చేయకుండా వదిలేశారు. మరి వాటిని మూడో పార్ట్ కోసమే అలా వదిలేశారా.. లేకుంటే అవి సమాధానం లేని ప్రశ్నలేనా.. అనే విషయంపై క్లారిటీ లేదు.. మొత్తానికైతే బాహుబలి మూడో పార్ట్ వచ్చినా రాకపోయినా.. తెలుగు ప్రేక్షకుల మదిలోనే కాదు.. యావత్ భారత సినీ అభిమానులు మదిలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది.

Comments

comments