Search
Saturday 22 July 2017
  • :
  • :
Latest News

సిన్న ఎన్‌టిఆర్ అదరగొట్టాడు పో…

NTR

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్‌టిఆర్, యంగ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం జై లవకుశ. ఈ నెల 20న ఎన్‌టిఆర్ బర్త్ డే సందర్భంగా శుక్రవారం ఈ మూవీలోని ఎన్‌టిఆర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఉగాది కానుకగా సినిమా టైటిల్ లోగోను విడుదల చేసిన మూవీ యూనిట్ తాజాగా ఎన్‌టిఆర్ లుక్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలు భారీగా పెంచేసిందనే చెప్పాలి.

NTR (1)

పోస్టర్‌లో ఎన్‌టిఆర్ ఎప్పటిలాగే గంభీరంగా రాజసం ఉట్టిపడేలా సూపర్బ్‌గా ఉన్నాడు. ఇంకో పోస్టర్‌లో చేతికి సంకేళ్లు, కూలింగ్ గ్లాస్‌తో అదరగొట్టాడు. జై లవకుశలో ఎన్‌టిఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి నెగేటివ్ షెడ్స్ ఉన్నా క్యారక్టర్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం విడుదల చేసిన పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో రావణసురుడు ఉండంట బట్టి చూస్తుంటే అదే పాత్రను తలపించేలా ఉంది.

NTR (2)

జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఎన్‌టిఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్‌టిఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Comments

comments