Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

రో‘హిట్’, విరాట్ విజృంభణ.. ఫైనల్స్ కి భారత్

Rohith-Sharma

బర్మింగ్ హామ్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ట్రోఫీని గెలుచుకునేందుకు ఫైనల్స్ లో దాయాది దేశాలు భారత్ పాకిస్థాన్ తలపడనున్నాయి. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ రోహిత్ శర్మ విరోచిత శతకం బాదాడు. 1 బంతుల్లో 1 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 34 బంతుల్లో 46 పరుగులు చేసి అర్థశతకాన్ని తృటిలో కోల్పోయాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో విజృంభించాడు. 78 బంతుల్లో 96 పరుగులు చేసి బట్టుని విజయం వైపుకు పరుగులు పెట్టించారు. దీంతో భారత్ కేవలం ఒక వికెట్ నష్టానికి 40.1 ఓవర్లలో 265 పరుగులు చేసి ఫైనల్స్ కి దూసుకుపోయింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది.

Comments

comments