Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

మృగరాజును భయపెట్టిన పిల్లి..!

Cat-Lion

సాధారణంగా మృగరాజు సింహమంటే అన్ని జంతువులు బెదిరిపోతాయి. సింహం వస్తుందటేనే.. ఎటువంటి జంతువైనా.. పరుగులు తీయాల్సిందే.. కానీ ఈ పిల్లి మాత్రం సింహంపైకి సవాల్ విసురుతుంది. నువ్వు మృగరాజు అయితే నాకేంటి అని కయ్యానికి కాలు దువ్వింది… సింహం ఎదురుగా నిలుచొని పిల్లి బెదిరిస్తుంటే.. సింహం కూడా వెనకడుగు వేసింది. అయితే ఈ పిల్లి ధైర్యానికి కారణం సింహం చుట్టు ఇనుప ఫెన్సింగ్ ఉండటమే..

టెక్సాస్‌లోని  సెంటర్‌ఫర్‌ యానిమల్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ లో దేరేక్‌ క్రాన్‌ అనే వ్యక్తికి బ్యాగీ అనే ఓ పెంపుడు పిల్లి ఉంది. దానిని నోయే అనే మృగరాజుపైకి ఉసిగొలిపి దేరేక్‌ విడిచిపెట్టాడు. ఆ పిల్లి వేగంగా సింహంవైపుకి దూసుకెళ్లగానే ఆ సింహం పిల్లిన భయపెడుదామనుకుంది. కానీ ఆ లోగానే పిల్లే ఆ పని చేసి సింహాన్ని కొన్ని సెకన్లపాటు అదిరిపోయి ఆగిపోయేలా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Comments

comments