Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కారులోంచి దూకాడు.. ప్రాణాలు కాపాడుకున్నాడు

Car-in-fire

బీజింగ్: చైనాలోని గౌంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ఓ ఘటన అక్కడి వారిని భయబ్రాంతులకు గురిచేసింది. ఓ యువకుడు నడుస్తున్న కారు నుంచి అమాంతం దూకేయడం, ఆ కారు కొద్ది దూరం వెళ్లగానే పెద్ద మంటలతో పేలిపోవడం జరిగింది. ఇది గమనించిన అక్కడి వాళ్లు ఇది ఆత్మహుతి దాడి అని భయపడిపోయారు.

అయితే అసలు విషయం ఏమిటంటే… సదరు వ్యక్తి తాను డ్రైవ్ చేస్తున్న కారు ఇంజిన్‌లో మంటలు రావడం పసిగట్టి వెంటనే రన్నింగ్‌లో ఉన్న కారు నుంచి బయటకు దూకేశాడు. ఆయన దూకడం కొన్ని క్షణాలు ఆలస్యమైనా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. అతడు దూకిన తర్వాత అక్కడికి కొద్దిదూరంలో ఉన్న పార్కింగ్ ప్లేస్‌లోకి వెళ్లిన కారు నుంచి పెద్దె ఎత్తున మంటలు చెలరేగాయి.

అంతే అక్కడ ఉన్న ఏడు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని అరగంట శ్రమించి మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Comments

comments